Rangareddy: అబ్దుల్లాపూర్‌మెట్: దళిత ఉప సర్పంచ్‌పై దాడిని ఖండించిన బీఎస్పీ
Rangareddy: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుంతపల్లిలో గ్రామసభలో దళిత ఉప సర్పంచ్ నర్సింగరావుపై దాడి చేసిన సర్పంచ్ దంపతులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ డిమాండ్.
Rangareddy: అబ్దుల్లాపూర్‌మెట్: దళిత ఉప సర్పంచ్‌పై దాడిని ఖండించిన బీఎస్పీ
Rangareddy: గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో దళిత ఉప సర్పంచ్ కరిమెల నర్సింగరావుపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్ అంతటి హేమలత, ఆమె భర్త జంగయ్య గౌడ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార మల్లేష్ డిమాండ్ చేశారు.
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఎస్పీ నాయకులు ఆందోళన నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ నర్సింగరావు మాట్లాడుతూ.. గుంతపల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో పలు అంశాలపై చర్చిస్తున్న సమయంలో సర్పంచ్ హేమలత, ఆమె భర్త జంగయ్య గౌడ్ తనను కులం పేరుతో దూషించి, చెప్పుతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
దళిత ఉప సర్పంచ్‌పై గ్రామ సభలోనే దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని బీఎస్పీ నేతలు పేర్కొన్నారు. ఉప సర్పంచ్‌గా గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించి భౌతిక దాడికి పాల్పడ్డారని నర్సింగరావు ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు విషయంలో జాప్యం చేస్తున్నారని బీఎస్పీ నాయకులు ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సర్పంచ్ హేమలతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తక్షణమే చర్యలు తీసుకోకపోతే అబ్దుల్లాపూర్‌మెట్‌లో జాతీయ రహదారిని ముట్టడిస్తామని బీఎస్పీ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ రంగారెడ్డి జిల్లా ఈసీ మెంబర్ చిత్రం కృష్ణ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యంజాల ప్రహ్లాద్, వార్డు సభ్యులు, నాయకులు అంతటి బాలకృష్ణగౌడ్, కరిమెల వెంకటేష్, కరిమెల శ్రీనివాస్, కరిమెల పోచయ్య, కరిమెల రవి, కరిమెల శంకరయ్య, కరిమెల భాస్కర్, చిత్రం బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు....




