Eatala Rajender: రాహుల్ గాంధీకి ఈటల స్ట్రాంగ్ కౌంటర్.. ఆ వ్యవస్థలను మర్చిపోయారా?

Eatala Rajender: ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వ్యవస్థలను అపహాస్యం చేసేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.

Arun Chilukuri
Published on: 14 Nov 2026 5:07 PM IST
Eatala Rajender: రాహుల్ గాంధీకి ఈటల స్ట్రాంగ్ కౌంటర్.. ఆ వ్యవస్థలను మర్చిపోయారా?
X

Eatala Rajender: కేంద్ర ఎన్నికల సంఘం (EC), సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను అపహాస్యం చేసేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రపంచంలోనే భారతదేశం అతిగొప్ప ప్రజాస్వామిక దేశమని తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి నేటి వరకు అందరూ చెబుతున్నారని, కానీ రాహుల్ గాంధీ మాత్రం భారత ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ దేశంలో నియంతృత్వం ఉందని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆనాటి నుంచి ఇదే ఎన్నికల సంఘం, ఇదే సుప్రీంకోర్టు వ్యవస్థలు కొనసాగుతున్నాయనే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించాలని ఈటల రాజేందర్ హితవు పలికారు. రాజకీయ విమర్శల పేరుతో చివరికి దేశాన్ని రక్షించే సైనికులను కూడా రాహుల్ కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలపై ప్రజల్లో అపనమ్మకం కలిగించేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఈటల పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగినట్లుగా ఎక్కడా ఎలాంటి స్కామ్‌లు, అవినీతికి తావులేకుండా దేశం గర్వించేలా ప్రధాని మోదీ పాలన కొనసాగిస్తున్నారని ఆయన కొనియాడారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.