Bandi Sanjay: బండి సంజయ్‌కు కీలక పదవి..? దసరా రోజు అధికారిక ప్రకటన ఛాన్స్!
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బండి సంజయ్ నియమితులయ్యే అవకాశం ఉంది. దసరా రోజు దీనిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉండగా, రాష్ట్రంలో బీజేపీ వ్యూహాలు మారుతున్నాయి.
Bandi Sanjay: బండి సంజయ్‌కు కీలక పదవి..? దసరా రోజు అధికారిక ప్రకటన ఛాన్స్!
Bandi Sanjay: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి, పార్టీలో దూకుడుగా వ్యవహరించే నేత బండి సంజయ్‌కు మరో కీలక బాధ్యత అప్పగించేలా అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఆయనను తెలంగాణ బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి రాబోయే దసరా పండుగ రోజు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన బండి సంజయ్‌కు ఇప్పుడు 'ప్రచార కమిటీ ఛైర్మన్' బాధ్యతలు అప్పగించి, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆయనతో మరోసారి పాదయాత్ర చేయించాలని హైకమాండ్ యోచిస్తోంది.
రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరును తీవ్రతరం చేసేందుకు బీజేపీ అధిష్టానం ద్విముఖ వ్యూహంతో పావులు కదుపుతోంది.
ఇప్పటికే రాష్ట్రంలో అమిత్ షా ప్రత్యేక టీంతో పాటు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్, సహా ఇంచార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ఇంచార్జీలుగా మధుకర్, దశరథ్ తదితరులు గ్రౌండ్ లెవల్‌లో వ్యూహాలు రచిస్తున్నారు.
పార్టీకి తగినంత సమయం కేటాయించలేని నాయకులు పదవుల నుంచి తప్పుకోవాలని ముందస్తుగానే స్పష్టం చేశారు. బూత్ స్థాయి కమిటీలు, సోషల్ మీడియా విభాగాలు, అన్ని అనుబంధ సంఘాలను క్షేత్రస్థాయి వరకు యాక్టివేట్ చేసేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు.




