Chevella: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్మీ వాహనం బోల్తా పడి 8 మంది జవాన్లకు తీవ్రగాయాలు!
Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడ సమీపంలో ఆర్మీ వాహనం బోల్తా పడిన ఘటనలో 8 మంది జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.
Chevella: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్మీ వాహనం బోల్తా పడి 8 మంది జవాన్లకు తీవ్రగాయాలు!
Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని అల్లవాడ సమీపంలో ఆర్మీ జవాన్లతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 8 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా మొత్తం 14 మంది జవాన్లతో కూడిన బృందం గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి షాబాద్ వైపు ప్రత్యేక వాహనంలో బయలుదేరింది. చేవెళ్ల మండలం అల్లవాడ సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు బలంగా ఢీకొని ఆగిపోయింది. ప్రమాద సమయంలో శిక్షణలో ఉన్న (ట్రైనీ) జవాను వాహనాన్ని నడుపుతున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 14 మందిలో 8 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఆర్మీ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లను హుటాహుటిన గోల్కొండలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్థానిక పోలీసులు, ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు.




