Amit Shah: అమిత్ షాను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్.. ఐటీసీ కాకతీయ వద్ద పొలిటికల్ హడావుడి!

Amit Shah: హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం, మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌లతో ఐటీసీ కాకతీయలో భేటీ.

Arun Chilukuri
Published on: 2 Nov 2026 2:38 PM IST
Amit Shah
X

Amit Shah: అమిత్ షాను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్.. ఐటీసీ కాకతీయ వద్ద పొలిటికల్ హడావుడి!

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు మరియు బిజెపి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన నేరుగా చార్మినార్‌కు చేరుకుని, అక్కడ ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

అమ్మవారి దర్శనం అనంతరం అమిత్ షా బేగంపేటలోని హోటల్‌ ఐటీసీ కాకతీయకు చేరుకోనున్నారు. భోజన విరామం తర్వాత అక్కడ పార్టీ ముఖ్యనేతలతో పాటు పలువురు ప్రముఖులతో ఆయన కీలక భేటీ కానున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌లతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త మైహోం రామేశ్వర్‌రావు కూడా ఐటీసీ కాకతీయలో అమిత్ షాను ప్రత్యేకంగా కలవనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

అనంతరం సాయంత్రం 4 గంటల తర్వాత నిజాం కళాశాల మైదానం ముందున్న బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద నుంచి మోజంజాహి మార్కెట్ వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక 'మహా పాదయాత్ర'లో అమిత్ షా పాల్గొంటారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌తో పాటు విపక్ష కూటమి ఢిల్లీలో చేపట్టిన నిరసన ర్యాలీలకు దీటుగా కౌంటర్ ఇచ్చేందుకు బిజెపి ఈ పాదయాత్రను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టి భారీ ఏర్పాట్లు చేసింది. పాదయాత్ర ముగింపులో ప్రజలను ఉద్దేశించి అమిత్ షా చేసే ప్రసంగంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.