Amitshah: ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం!

Amitshah: భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మహాపాదయాత్ర'లో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు.

G Krishna
Published on: 2 Nov 2026 4:50 PM IST
Amitshah
X

Amitshah: ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం!

Amitshah: భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మహాపాదయాత్ర'లో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బీజేపీ ముఖ్యనేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాతబస్తీలోని చారిత్రాత్మక చార్మినార్ వద్ద ఉన్న శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనకు తీర్థప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందజేశారు.

అమ్మవారి పూజ అనంతరం అమిత్ షా ఆకాంక్ష

భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం అమిత్ షా సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలంతా సుఖశాంతులు, సిరిసంపదలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించాను" అని ఆయన పేర్కొన్నారు. అలాగే 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం' అనే నినాదంతో సాగే ఈ పాదయాత్రలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఐటీసీ కాకతీయలో లంచ్ మీటింగ్.. పాదయాత్రకు రంగం సిద్ధం

అమ్మవారి దర్శనం ముగించుకుని అమిత్ షా ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్యనేతలతో కలిసి లంచ్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పాదయాత్ర నిర్వహణపై చర్చించిన అనంతరం, సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమయ్యే 'మహాపాదయాత్ర'లో పాల్గొనేందుకు బయలుదేరారు.

బీజేపీ శ్రేణులు, వేలాది మంది మద్దతుదారుల నడుమ సాగనున్న ఈ యాత్ర ముగింపులో మొజాంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద జరిగే బహిరంగ సభను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.