8,500mAh బ్యాటరీ.. 200MP కెమెరాలు.! Xiaomi 18 Pro సిరీస్ వచ్చేస్తోంది..
ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ (Xiaomi) తమ మోస్ట్ అవైటెడ్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ లాంచ్ డేట్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. కంపెనీ..
Xiaomi 18 Pro Series
ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ (Xiaomi) తమ మోస్ట్ అవైటెడ్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ లాంచ్ డేట్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. కంపెనీ ఎప్పటి నుంచో టీజ్ చేస్తున్న 'షావోమీ 18 ప్రో' (Xiaomi 18 Pro) సిరీస్ వచ్చే సెప్టెంబర్ 23న చైనాలో జరగబోయే 'ఆటమ్ న్యూ ప్రొడక్ట్ లాంచ్' ఈవెంట్‌లో అధికారికంగా రిలీజ్ కానుంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో షావోమీ 18 ప్రోతో పాటు షావోమీ 18 ప్రో మ్యాక్స్ (Xiaomi 18 Pro Max) మోడళ్లు గ్రాండ్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. 'ఫుల్ అప్‌గ్రేడ్' అనే క్యాచీ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ ఫోన్లలో ఐదు కీలకమైన ఫీచర్లను కంపెనీ స్పెషల్‌గా ప్రమోట్ చేస్తోంది.
2nm సూపర్ ప్రాసెసర్ , పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్
షావోమీ 18 ప్రో సిరీస్‌లో అత్యంత వేగవంతమైన 2nm GAA ప్రాసెస్‌పై రూపుదిద్దుకున్న ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను ఉపయోగించబోతున్నారు. ఈ కొత్త ప్రాసెసర్ ద్వారా ఫోన్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా పవర్ ఎఫిషియెన్సీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. అయితే చిప్ నేమ్‌ను కంపెనీ ఇంకా సీక్రెట్‌గానే ఉంచినప్పటికీ, ఇది క్వాల్‌కామ్ రాబోయే 'స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6' కావచ్చునని లీక్స్ చెబుతున్నాయి. సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమయ్యే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో ఈ ప్రాసెసర్ వివరాలపై క్లారిటీ రానుంది.
రెండు 200MP కెమెరాలతో లైకా పవర్
ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో మెయిన్ అట్రాక్షన్ వీటి కెమెరా సెటప్‌నే అని చెప్పవచ్చు. లైకా (Leica) తో భాగస్వామ్యంలో రూపొందించిన ఈ ఫోన్లలో ఏకంగా రెండు 200MP సెన్సార్లను అందించబోతున్నారు. ఇందులో ఒకటి పెద్ద సెన్సార్ ఉన్న ప్రైమరీ మెయిన్ కెమెరా కాగా, మరొకటి భారీ సెన్సార్ ఉన్న పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా. నంబర్డ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో తాము ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అత్యంత పవర్‌ఫుల్ కెమెరా సెటప్ ఇదేనని షావోమీ క్లెయిమ్ చేస్తోంది. ఇవి 17mm నుంచి 75mm ఫోకల్ రేంజ్‌తో 3.2x పెరిస్కోప్ జూమ్‌ను సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
అల్ట్రా థిన్ బెజెల్స్ , హై-ఎండ్ డిస్‌ప్లే టెక్నాలజీ
డిస్‌ప్లే విభాగానికి వస్తే, షావోమీ ఇందులో సూపర్ పిక్సెల్ ప్యానెల్‌తో పాటు M11 లైట్ ఎమిటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించింది. దీనివల్ల తక్కువ బ్యాటరీ కన్జంప్షన్‌తో కళ్లకు విజువల్స్ చాలా బ్రైట్‌గా , క్లియర్‌గా కనిపిస్తాయి. అంతేకాకుండా కొత్త ప్యాకేజింగ్ టెక్నాలజీ సాయంతో ఫోన్ స్క్రీన్ చుట్టూ ఉండే బెజెల్స్‌ను కేవలం 0.99mm కి తగ్గించి ఫుల్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.
రాక్షస బ్యాటరీ బ్యాకప్ , 100W ఫాస్ట్ ఛార్జింగ్
బ్యాటరీ విషయంలో రెండు మోడళ్ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఉండనుంది. ఈ సిరీస్‌లో షావోమీ జీఎస్‌ఆర్ VIII బ్యాటరీ టెక్నాలజీతో పాటు 32% సిలికాన్ కంటెంట్‌ను ఉపయోగించారు. షావోమీ 18 ప్రో మోడల్‌లో 7,000mAh బ్యాటరీ ఉండగా, షావోమీ 18 ప్రో మ్యాక్స్ వేరియంట్‌లో ఏకంగా 8,500mAh భారీ బ్యాటరీని అమర్చారు. వీటికి సపోర్ట్‌గా 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ రానుందని సమాచారం. సెప్టెంబర్ 23న జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో వీటి కంప్లీట్ స్పెసిఫికేషన్లు , ప్రైస్ డిటైల్స్ అధికారికంగా వెల్లడి కానున్నాయి.




