సాకెట్లో చార్జర్ పెట్టగానే నిప్పురవ్వలు వస్తున్నాయా.. అసలు రీజన్ ఇదే..?
Charger Spark Reason: చార్జర్‌ను సాకెట్లో పెట్టేటప్పుడు చిన్న నిప్పురవ్వ రావడం లేదా చిన్నగా "చట్" శబ్దం రావడం చాలామంది గమనించే ఉంటారు. ఎక్కువమంది దీన్ని పట్టించుకోరు.
సాకెట్లో చార్జర్ పెట్టగానే నిప్పురవ్వలు వస్తున్నాయా.. అసలు రీజన్ ఇదే..?
Charger Spark Reason: చార్జర్‌ను సాకెట్లో పెట్టేటప్పుడు చిన్న నిప్పురవ్వ రావడం లేదా చిన్నగా "చట్" శబ్దం రావడం చాలామంది గమనించే ఉంటారు. ఎక్కువమంది దీన్ని పట్టించుకోరు. కానీ దీనివల్ల మీ ఫోన్ లేదా చార్జర్ పాడవుతుందా అనే సందేహం కలుగుతుంది. ఈ నిప్పురవ్వ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం.
సాకెట్ నుంచి వచ్చే నిప్పురవ్వను నిర్లక్ష్యం చేస్తే చార్జర్ సర్క్యూట్ పాడయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను సరిచేయడం చాలా సులభం. చార్జర్‌ను సాకెట్లో పెట్టే ముందు స్విచ్ ఆఫ్ చేసి ఉంచడం ద్వారా దీన్ని సులభంగా నివారించవచ్చు.
చార్జర్ పెట్టినప్పుడు నిప్పురవ్వ ఎందుకు వస్తుంది?
చార్జర్‌లో అనేక కెపాసిటర్లు ఉంటాయి. దాన్ని సాకెట్లో పెట్టినప్పుడు ఈ కెపాసిటర్లు వేగంగా విద్యుత్తును లాగుతాయి. సాంకేతిక భాషలో దీన్ని ఇన్రష్ కరెంట్ అంటారు.
చార్జర్ పిన్లు, సాకెట్ లోపలి మెటల్ కాంటాక్ట్‌లకు తగిలే కొద్ది క్షణాల ముందు గాలి ద్వారా కరెంట్ దూకుతుంది.
దీనివల్ల నానో సెకన్ల పాటు చిన్న నిప్పురవ్వ లేదా స్పార్క్ కనిపిస్తుంది. దీన్ని ఆర్క్ (arc) అని కూడా అంటారు.
ఫోన్ లేదా చార్జర్ పాడవుతాయా?
సాధారణంగా ఈ స్పార్క్ మీ చార్జర్‌కు లేదా ఫోన్‌కు హాని చేయదు. ఎందుకంటే అడ్వాన్స్డ్ చార్జర్లలో ఇన్‌బిల్ట్ ప్రొటెక్షన్ సర్క్యూట్, వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంటాయి.
అయితే సాకెట్ లోపల పెద్ద స్పార్క్ పదేపదే వస్తుంటే, దాని నుంచి వచ్చే హై వోల్టేజ్ సర్జ్ మీ చార్జర్ సర్క్యూట్‌ను త్వరగా పాడు చేయవచ్చు.
పదేపదే స్పార్కింగ్ జరిగితే చార్జర్ పిన్లు నల్లగా మారిపోతాయి. సాకెట్ లోపల కూడా కాలిపోయే ప్రమాదం ఉంది.
సులభమైన పరిష్కారం..
చార్జర్‌ను ప్లగ్‌లో పెట్టే ముందు స్విచ్ ఆఫ్ చేసి ఉంచండి. చార్జర్‌ను పూర్తిగా సాకెట్లో కూర్చోబెట్టాక మాత్రమే స్విచ్ ఆన్ చేయండి. ఇలా చేస్తే నిప్పురవ్వ సమస్య రాదు.
ఇంట్లో ఏదైనా సాకెట్ వదులుగా ఉన్నా, లేదా చార్జర్ సాకెట్లో వదులుగా కూర్చుంటున్నా వెంటనే సరిచేయించండి.
ఎల్లప్పుడూ బ్రాండెడ్, బీఐఎస్ (BIS) సర్టిఫైడ్ చార్జర్లు, మంచి నాణ్యత గల సాకెట్లు వాడండి. దీనివల్ల డివైజ్, ఇల్లు రెండూ విద్యుత్ ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉంటాయి.




