వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై మెసేజ్‌లు, ఫోటోలు షెడ్యూల్ చేసేయోచ్చు
Whatsapp: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో కీలకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చే పనిలో పడింది.
వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై మెసేజ్‌లు, ఫోటోలు షెడ్యూల్ చేసేయోచ్చు
Whatsapp: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో కీలకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చే పనిలో పడింది. ఇకపై యూజర్లు మెసేజ్‌లతో పాటు ఫోటోలు, వీడియోలను కూడా ముందే షెడ్యూల్ చేసుకునే సదుపాయాన్ని తీసుకువస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో పరీక్షిస్తున్నారు.
ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ ఫీచర్ ద్వారా పంపాలనుకున్న మెసేజ్ లేదా మీడియా ఫైల్‌ను టైప్ చేసిన తర్వాత, సెండ్ బటన్‌ను ఎక్కువసేపు ప్రెస్ చేసి ఉంచితే (Tap and Hold) డెలివరీ చేయాల్సిన తేదీ, సమయాన్ని ఎంచుకునే ఆప్షన్ వస్తుంది. యూజర్లు కనీసం 10 నిమిషాల ముందు నుంచి గరిష్టంగా రెండు వారాల ముందు వరకు మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. నిర్ణీత సమయానికి ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా లేదా యాప్ క్లోజ్ చేసి ఉన్నా సరే మెసేజ్ ఆటోమేటిక్‌గా వెళ్లిపోతుంది.
షెడ్యూల్ చేసిన మెసేజ్‌ల నిర్వహణ:
యూజర్ల సౌలభ్యం కోసం చాట్ ఇన్ఫో స్క్రీన్‌లో ప్రత్యేకంగా ‘షెడ్యూల్డ్ మెసేజెస్’ సెక్షన్ అందుబాటులో ఉంటుంది. మెసేజ్ సెండ్ కాకముందే దాన్ని పరిశీలించడానికి లేదా డిలీట్ చేయడానికి ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను డిలీట్ చేస్తే, అవతలి వ్యక్తికి ఎలాంటి నోటిఫికేషన్ లేదా సమాచారం వెళ్లదు.
ప్రస్తుతానికి ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉండగా, త్వరలోనే సాధారణ యూజర్లందరికీ పూర్తిస్థాయిలో రోల్ అవుట్ అయ్యే అవకాశం ఉంది.




