Vi Voice Only Plans: వొడాఫోన్ ఐడియా అదిరిపోయే ఆఫర్లు.. వీఐ కొత్తగా 4 వాయిస్ రీఛార్జ్ ప్లాన్స్..!

Vi Voice Only Plans: వొడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారుల కోసం నాలుగు కొత్త వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది.

Venkat
Published on: 30 Oct 2026 7:39 PM IST
Vi Voice Only Plans
X

Vi Voice Only Plans: వొడాఫోన్ ఐడియా అదిరిపోయే ఆఫర్లు.. వీఐ కొత్తగా 4 వాయిస్ రీఛార్జ్ ప్లాన్స్..!

Vi Voice Only Plans: వొడాఫోన్ ఐడియా (Vi) భారత మార్కెట్లో నాలుగు కొత్త వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. డేటా అవసరం లేని వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులు, తక్కువ ఆదాయం ఉన్న కస్టమర్లకు ఈ రీఛార్జ్‌లు ఉపయోగపడే అవకాశం ఉంది.

రూ. 179 ప్లాన్‌తో ప్రారంభం..

వీఐ కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్స్‌లో అత్యంత చౌకైనది రూ. 179 రీఛార్జ్. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 25 రోజులు. అదనంగా వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్‌ ద్వారా కంటెంట్‌ను ఉచితంగా చూసే అవకాశం కూడా ఉంది.

రూ. 189 ప్లాన్ ఎలా ఉందంటే?

రూ. 189 రీఛార్జ్‌లోనూ అన్‌లిమిటెడ్ కాల్స్, 300 SMSలు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. రూ. 179 ప్లాన్‌లో ఉన్న వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్ ప్రయోజనం ఇందులో లేదు.

రూ. 203, రూ. 206 ప్లాన్స్..

రూ. 203 వాయిస్-ఓన్లీ ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMSలు ఉంటాయి. ఇక రూ. 206 ప్లాన్‌లో ఒక నెల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMSలు అందిస్తున్నారు. రూ. 189, రూ. 203 ప్లాన్స్ మాదిరిగానే ఇందులోనూ వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్ ప్రయోజనం లేదు.

ఈ కొత్త ప్లాన్స్ వెనుక ట్రాయ్ ఆదేశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్‌లో టెలికాం సంస్థలు వాయిస్, SMS కోసం ప్రత్యేక టారిఫ్ వోచర్లు అందించాలని ట్రాయ్ సూచించింది. తక్కువ ఆదాయం ఉన్నవారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు, ఫీచర్ ఫోన్లు ఉపయోగించే కస్టమర్లకు తక్కువ వ్యవధి రీఛార్జ్‌లు అవసరమని ట్రాయ్ పేర్కొంది.

ఇదే మార్గంలో ఎయిర్‌టెల్ కూడా ఈ నెలలో మూడు వాయిస్-ఓన్లీ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. రూ. 189, రూ. 203, రూ. 206 ప్లాన్స్‌లో ఎయిర్‌టెల్ అందిస్తున్న వ్యాలిడిటీలు వీఐ కొత్త ప్లాన్స్‌తో సమానంగా ఉన్నాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.