భారీ బ్యాటరీతో వివో వై600ఎస్ ప్రో విడుదల.. ధరెంతంటే..?
vivo y600s pro: మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను వివో సంస్థ తీసుకువచ్చింది. భారీ బ్యాటరీ సామర్థ్యంతో పాటు ఆకట్టుకునే ఫీచర్లతో ఈ కొత్త మొబైల్ చైనాలో లాంచ్ అయింది.
భారీ బ్యాటరీతో వివో వై600ఎస్ ప్రో విడుదల.. ధరెంతంటే..?
vivo y600s pro: వివో (Vivo) Y600s Pro స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో నిశ్శబ్దంగా విడుదల చేసింది. Y600 సిరీస్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీతో పాటు అధిక రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్‌ప్లేను అందించారు. గతంలో విడుదలైన వివో వై600ఎస్ ప్రో లో కనిపించిన పలు ముఖ్యమైన హార్డ్‌వేర్ అంశాలు ఇందులోనూ ఉన్నాయి.
చైనాలో వివో వై600ఎస్ ప్రో ధర 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్‌కు CNY 2,699, 8GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్‌కు CNY 2,999గా ఉంది. భారత కరెన్సీలో ఇవి సుమారు రూ.39,000, రూ.43,300. మూన్ లైట్ బ్లాక్, ఫ్లోటింగ్ గోల్డ్, స్టారీ పర్‌పుల్, వాస్ట్ బ్లూ రంగుల్లో ఫోన్ లభిస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజాన్ ఓస్ 6పై పనిచేస్తుంది. 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే 2,800×1,260 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR, P3 వైడ్ కలర్ గామట్‌కు మద్దతు ఇస్తుంది.
ఫోన్‌లో 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300e చిప్‌సెట్, 8GB LPDDR5 ర్యామ్ ఉన్నాయి. స్టోరేజ్ 512GB వరకు ఉంటుంది. మెమరీ ఫ్యూజన్ ద్వారా అదనంగా 8GB వర్చువల్ ర్యామ్‌ను ఉపయోగించుకోవచ్చు.
కెమెరాల విషయానికి వస్తే వెనుక 50MP కెమెరా, ముందు 32MP కెమెరా ఉన్నాయి. రెండు కెమెరాల్లో EIS సపోర్ట్ ఉంది. 1080p వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
ప్రధాన ఆకర్షణ 10,200mAh బ్యాటరీ. దీనికి 90W వైర్డ్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi 6, బ్లుటూత్ 5.4, NFC, USB Type-C వంటి సదుపాయాలు ఉన్నాయి. స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఫేస్ రికగ్నిషన్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ కూడా అందించారు.




