Vivo V80: 7200mAh బ్యాటరీ, 50MP కెమెరాలు.. రూ.62,999 ఫోన్ ఇప్పుడు రూ.53 వేలకేనా?

Vivo V80: నూతన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు, ముఖ్యంగా వివో బ్రాండ్ ఇష్టపడే వారికి ఫ్లిప్‌కార్ట్ ఒక అద్భుతమైన అవకాశాన్ని తెచ్చింది.

CR Reddy
Published on: 2 Nov 2026 9:37 AM IST
Vivo V80
X

Vivo V80

Vivo V80: నూతన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు, ముఖ్యంగా వివో బ్రాండ్ ఇష్టపడే వారికి ఫ్లిప్‌కార్ట్ ఒక అద్భుతమైన అవకాశాన్ని తెచ్చింది. ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ బాంగ్ దీపావళి సేల్ 2026 సందర్భంగా ఇటీవల భారత మార్కెట్లో విడుదలైన వివో V80 స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని రేంజ్‌లో బ్యాంక్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.62,999 కాగా, ప్రముఖ బ్యాంక్ కార్డులను ఉపయోగించి బిల్లు చెల్లించడం ద్వారా 54 వేల రూపాయల కంటే తక్కువ ధరకే దీనిని సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించారు.

బ్యాంక్ ఆఫర్ల వివరాలు

వివో V80 మోడల్ మొత్తం మూడు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆధారిత బేస్ మోడల్ అసలు ధర రూ.62,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.9,135 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో దీని ఎఫెక్టివ్ ముగింపు ధర రూ.53,864 కి తగ్గుతుంది. ఇక 8GB + 256GB వేరియంట్ ధర రూ.69,999 గా ఉండగా, రూ.10,150 బ్యాంక్ ఆఫర్ పోను రూ.59,849 కే లభిస్తోంది. టాప్ మోడల్ అయిన 8GB + 512GB వేరియంట్‌పై గరిష్టంగా రూ.11,600 క్యాష్‌బ్యాక్ లభించడంతో రూ.79,999 ఉన్న ఫోన్ రూ.68,399 కే దక్కుతుంది.

అద్భుతమైన డిస్‌ప్లే, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్

డిజైన్ పరంగా వివో V80 అత్యంత ప్రీమియం మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అమర్చారు. ఇది 144Hz వేగవంతమైన రీఫ్రెష్ రేట్‌తో పాటు 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ ప్రాసెసింగ్ విభాగంలో పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను జోడించారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత OriginOS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ మొబైల్‌కు నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

ట్రిపుల్ 50MP కెమెరా, 7200mAh భారీ బ్యాటరీ

ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ఈ ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ ఇచ్చారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్స్ ఆల్ట్రావైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్స్ టెలిఫోటో కెమెరా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర ఏకంగా 50 మెగాపిక్సెల్స్ కెమెరాను అమర్చడం విశేషం. దీనితో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 7,200mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP69 రేటింగ్ లభించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.