మార్కెట్‌ను షేక్ చేసే ఫోన్ వచ్చేసిందిగా.. వివో ఎస్60టీ ధరెంతో తెలుసా?

Vivo s60t Price: చైనా మార్కెట్లోకి వివో బ్రాండ్ నుంచి మరో కొత్త ఫోన్ అడుగుపెట్టింది. శక్తివంతమైన కెమెరాలు, భారీ బ్యాటరీ కలిగిన ఈ సరికొత్త హ్యాండ్‌సెట్ వివరాలు టెక్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Venkat
Published on: 5 Oct 2026 8:48 PM IST
Vivo s60t Price
X

మార్కెట్‌ను షేక్ చేసే ఫోన్ వచ్చేసిందిగా.. వివో ఎస్60టీ ధరెంతో తెలుసా?

Vivo s60t Price: వివో ఎస్60 సిరీస్‌లో భాగంగా మరో కొత్త మోడల్ అయిన వివో ఎస్60టీ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పటికే ఈ లైనప్‌లో వచ్చిన వివో ఎస్60, వివో ఎస్60 వైటాలిటీ ఎడిషన్ తర్వాత ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ డివైజ్ కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో, మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ధరల విషయానికి వస్తే, బేస్ మోడల్ ధర సుమారు రూ. 52,000గా ఉండగా, హై-ఎండ్ వేరియంట్ ధర సుమారు రూ. 57,000 వరకు ఉంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 7పై పనిచేస్తుంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.59-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. అలాగే డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను కలిగి ఉంది. పనితీరు కోసం క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్‌ను అమర్చారు. 12జీబీ ర్యామ్‌తో పాటు వర్చువల్ ర్యామ్ పెంపుదల సదుపాయం కూడా ఉంది.

కెమెరా విభాగం ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ ఇచ్చారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, అల్ట్రావైడ్ లెన్స్, 100x డిజిటల్ జూమ్ సామర్థ్యం గల 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో మరో 50 మెగాపిక్సెల్ కెమెరాను పొందుపరిచారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, 7,200mAh భారీ బ్యాటరీతో పాటు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. భద్రత కోసం ఇన్-డిస్‌‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.