Vi new recharge plans: Vi యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.179లకే అదిరిపోయే ప్లాన్.. బెనిఫిట్స్ ఏంటంటే?

Vi new recharge plans: వొడాఫోన్ ఐడియా (Vi) భారత్‌లో ఆరు కొత్త వాయిస్-ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ల ధర రూ.179 నుంచి మొదలవుతుంది. గరిష్ఠంగా 365 రోజుల వ్యాలిడిటీ కూడా లభిస్తుంది.

Venkat
Published on: 1 Nov 2026 6:36 PM IST
Vi new recharge plans
X

Vi new recharge plans: Vi యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.179లకే అదిరిపోయే ప్లాన్.. బెనిఫిట్స్ ఏంటంటే?

Vi new recharge plans: వొడాఫోన్ ఐడియా (Vi) భారతీయ కస్టమర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. వీటి ధర రూ.179 నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీలు కేవలం కాలింగ్ ప్లాన్లను కూడా అందించాలని టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ప్లాన్లలో మొబైల్ డేటా లభించదు, కానీ మెసేజ్ సౌకర్యం ఉంటుంది.

Vi మొత్తం 6 కొత్త వాయిస్-ఓన్లీ ప్లాన్లను లాంచ్ చేసింది. ఇవి సెగ్మెంట్‌లోనే అత్యంత చౌకైన ప్లాన్లని కంపెనీ చెబుతోంది. వేర్వేరు వ్యాలిడిటీలతో ఈ ప్లాన్లు వచ్చాయి. వీటిలో గరిష్ఠంగా 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కూడా ఉంది.

Vi రూ.179 రీఛార్జ్ ప్లాన్..

అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 25 రోజుల వ్యాలిడిటీ, అదనపు ప్రయోజనంగా Vi Movie & TV యాప్ యాక్సెస్, Vi రూ.185 రీఛార్జ్ ప్లాన్, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 28 రోజుల వ్యాలిడిటీ, Vi Movie & TV యాప్ కాంప్లిమెంటరీ యాక్సెస్.

Vi రూ.203 రీఛార్జ్ ప్లాన్, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 30 రోజుల వ్యాలిడిటీ, Vi Movie & TV యాప్ కాంప్లిమెంటరీ యాక్సెస్, Vi రూ.206 రీఛార్జ్ ప్లాన్ ,అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, నెల రోజుల వ్యాలిడిటీ, Vi Movie & TV యాప్ కాంప్లిమెంటరీ యాక్సెస్.

Vi రూ.470 రీఛార్జ్ ప్లాన్, అన్‌లిమిటెడ్ కాలింగ్, 900 SMS, 84 రోజుల వ్యాలిడిటీ, Vi Movie & TV యాప్ కాంప్లిమెంటరీ యాక్సెస్, Vi రూ.1849 రీఛార్జ్ ప్లాన్.

Vi అధికారిక పోర్టల్‌లో రూ.1849 ప్లాన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో కేవలం కాలింగ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్‌కు పూర్తి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే 3,600 SMS కూడా ఇస్తారు.

గమనిక: ఈ ప్లాన్లలో మొబైల్ డేటా లభించదు. కేవలం కాలింగ్, SMS సౌకర్యాలు మాత్రమే ఉంటాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.