నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై ఫోన్ కాల్స్‌లో భారీ మార్పులు..!
DoT caller name display: ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రజల మధ్య కమ్యూనికేషన్ చాలా సులభమైంది. కనెక్టివిటీ సమస్యలు తగ్గినా, అదే సమయంలో సైబర్ నేరాల ముప్పు కూడా పెరుగుతోంది.
నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై ఫోన్ కాల్స్‌లో భారీ మార్పులు..!
DoT caller name display: టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ (DoT) తీసుకొస్తున్న కొత్త కॉलर నేమ్ డిస్ప్లే నిబంధనతో ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను గుర్తించడం మరింత సులభం కావచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే కాల్ వచ్చినప్పుడు నంబర్‌తో పాటు కాల్ చేస్తున్న వ్యక్తి రిజిస్టర్డ్ పేరు కూడా స్క్రీన్‌పై కనిపించవచ్చు. దీని ద్వారా స్పామ్ కాల్స్, సైబర్ మోసాలను గుర్తించడంలో యూజర్లకు కొంత మేర సహాయం అందే అవకాశం ఉంది.
ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రజల మధ్య కమ్యూనికేషన్ చాలా సులభమైంది. కనెక్టివిటీ సమస్యలు తగ్గినా, అదే సమయంలో సైబర్ నేరాల ముప్పు కూడా పెరుగుతోంది. ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేసే ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కొంతమంది మోసగాళ్లు బ్యాంక్ అధికారులుగా, పోలీసులుగా పరిచయం చేసుకుని ప్రజలను నమ్మించి డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు నవంబర్ 1 నుంచి కీలక మార్పు రాబోతున్నట్లు సమాచారం. ఇకపై ఇన్కమింగ్ కాల్ సమయంలో తెలియని నంబర్‌కు సంబంధించిన పేరు కనిపించే సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌కు సంబంధించి టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ (DoT) గతంలోనే టెస్టింగ్‌కు సంబంధించిన ఆదేశాలు ఇచ్చింది. ఈ సదుపాయం వల్ల యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం.
కొత్త నిబంధనతో యూజర్లకు కలిగే ప్రయోజనాలు
1. తెలియని కాలర్ ఎవరో తెలుసుకోవచ్చు
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు స్క్రీన్‌పై నంబర్‌తో పాటు రిజిస్టర్డ్ పేరు కూడా కనిపించవచ్చు. దీంతో కాల్ ఎత్తే ముందే ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ సమాచారం ఆధారంగా కాల్‌ను స్వీకరించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది.
2. ఫ్రాడ్ కాల్స్ గుర్తించడంలో సహాయం
కాలర్ పేరు కనిపించడం వల్ల అనుమానాస్పద కాల్స్‌ను గుర్తించడానికి మరో మార్గం లభించవచ్చు. ఉదాహరణకు, ఎవరైనా తాను బ్యాంక్ అధికారి లేదా ఒక కంపెనీ ఉద్యోగి అని చెప్పి ఫోన్ చేస్తే, కాలర్ వివరాలను పరిశీలించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడవచ్చు. అయితే స్క్రీన్‌పై పేరు కనిపించిందనే కారణంతోనే ఆ కాల్‌ను సురక్షితమైనదిగా భావించకూడదు.
3. కాలింగ్‌లో పారదర్శకత పెరగొచ్చు
ప్రస్తుతం తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవడం చాలాసార్లు కష్టంగా ఉంటుంది. కొత్త ఫీచర్ అమల్లోకి వస్తే నంబర్‌తో పాటు కాలర్ రిజిస్టర్డ్ పేరు కూడా కనిపించే అవకాశం ఉంది. దీంతో కాల్ ఎత్తే ముందే యూజర్‌కు అదనపు సమాచారం లభిస్తుంది. ఫలితంగా కాలింగ్‌లో మరింత పారదర్శకత ఏర్పడవచ్చు.
4. సైబర్ మోసాలను ఎదుర్కోవడంలో ఉపయోగపడొచ్చు
సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అధికారులు, పోలీసులు లేదా ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పుకుంటూ ప్రజలకు ఫోన్ చేసి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కాలర్ పేరు కనిపించడం వల్ల ఇలాంటి అనుమానాస్పద కాల్స్‌ను గుర్తించేందుకు యూజర్లకు కొంత సహాయం లభించవచ్చు.
అయితే ఈ ఫీచర్ ఒక్కటే సైబర్ మోసాలను పూర్తిగా అరికట్టదు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు లేదా OTPలను షేర్ చేయకూడదు.




