SIM Binding Rules: జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ రూల్స్.. ఆ ఫోన్లలో వాట్సప్, టెలిగ్రామ్ సేవలు బంద్!
SIM Binding Rules: జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ నిబంధనలు అమలు. సిమ్ కార్డ్ లేని ఫోన్లలో వాట్సప్, టెలిగ్రామ్ సేవలు నిలిచిపోనున్నాయి.
SIM Binding Rules: జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ రూల్స్.. ఆ ఫోన్లలో వాట్సప్, టెలిగ్రామ్ సేవలు బంద్!
SIM binding: సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర టెలికాం శాఖ (DoT) సంచలన నిర్ణయం తీసుకుంది. వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి పాపులర్ మెసేజింగ్ యాప్‌లకు సంబంధించిన 'సిమ్ బైండింగ్' (SIM binding) కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం.. డివైజ్‌లో లైవ్ సిమ్ కార్డ్ లేకపోతే ఆయా ఫోన్లలో కమ్యూనికేషన్ యాప్స్ పనిచేయవు. డిసెంబర్ 31లోగా మెసేజింగ్ యాప్ ఖాతాలన్నింటినీ యాక్టివ్ సిమ్‌లతో అనుసంధానించాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఎందుకు ఈ మార్పు?:
ప్రస్తుతం వాట్సప్‌ను ఇన్స్టాల్ చేసుకునే సమయంలో మాత్రమే సిమ్ ధ్రువీకరణ (OTP) అవసరమవుతోంది. ఆ తర్వాత ఫోన్ నుంచి సిమ్ తొలగించినా లేదా డీయాక్టివేట్ చేసినా యాప్ పనిచేస్తూనే ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని విదేశాల్లో ఉన్న సైబర్ క్రిమినల్స్ భారతీయ నంబర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. సిమ్ బైండింగ్ విధానంతో ఈ మోసాలకు చెక్ పడనుంది.
ఎవరిపై ప్రభావం చూపుతుంది?
♦ సిమ్ కార్డ్ లేకుండా కేవలం వైఫై (Wi-Fi) ఆధారంగా వాట్సప్ వాడుతున్న వారి ఫోన్లలో సేవలు ఆగిపోతాయి.
♦ డివైజ్ నుంచి సిమ్‌ను బయటకు తీసిన వెంటనే యాప్ ఆటోమేటిక్‌గా పనిచేయడం ఆగిపోతుంది.
♦ ఒకే నంబర్‌తో వేర్వేరు డివైజులలో వాట్సప్ వాడుతున్నప్పుడు.. ప్రైమరీ డివైజ్ తప్ప మిగతా వాటిలో లాగౌట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ నిబంధనలను ఈ ఏడాది మార్చి నుంచే అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, టెలికాం పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది.




