Samsung: 200MP కెమెరా.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్.. శాంసంగ్ ప్రీమియం ఫోన్ పై భారీ డిస్కౌంట్
Samsung: శాంసంగ్ కంపెనీకి చెందిన అత్యంత ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే టెక్ లవర్లకు అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Samsung Galaxy S25 Ultra
Samsung: శాంసంగ్ కంపెనీకి చెందిన అత్యంత ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే టెక్ లవర్లకు అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాలి ఎడిషన్ సేల్‌లో భాగంగా సమ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా 5జీ ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. రూ.1,29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ ప్రీమియం 5జీ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లను ఉపయోగించి ఏకంగా రూ.47,849 వరకు ఆదా చేసుకునే అద్భుతమైన అవకాశం లభిస్తోంది.
ఆఫర్లు, ధర తగ్గింపు వివరాలు
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా 5జీ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో రూ.94,999 వద్ద లిస్ట్ అయింది. దీపావళి ప్రత్యేక సేల్ ఆఫర్‌లో భాగంగా అందించే రూ.10,000 కూపన్ డిస్కౌంట్ వర్తింపజేస్తే ఫోన్ ధర నేరుగా రూ.84,999కి తగ్గుతుంది. దీనికి అదనంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు జరిపితే మరొక రూ.2,849 అదనపు రాయితి లభిస్తుంది. ఈ ఆఫర్లన్నీ కలుపుకుంటే వినియోగదారులు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కేవలం రూ.82,150 ఎఫెక్టివ్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
సూపర్ క్వాలిటీ డిస్ప్లే.. పవర్‌ఫుల్ ప్రాసెసర్
ఈ స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్ప్లే కలిగి ఉంది. ఇది 1400×3120 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఎంతటి తీవ్రమైన ఎండలోనైనా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పనితీరు విషయానికి వస్తే క్వాల్‌కామ్ సంస్థకు చెందిన అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తూ బహుళ పనులను, హై-ఎండ్ గేమింగ్‌ను చాలా సులభంగా నిర్వహించగలదు.
200MP కెమెరా సెటప్.. క్వాడ్ క్యామ్ మ్యాజిక్
ఫొటోగ్రఫీ, వీడియోల కోసం శాంసంగ్ ఈ ఫోన్‌లో క్వాడ్ కెమెరా నెట్‌వర్క్‌ను అందించింది. ఇందులో ప్రధానంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 10 మెగాపిక్సెల్ మరొక టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ప్రొఫెషనల్ స్థాయి డిఎస్‌ఎల్‌ఆర్ ఫొటోలు, 8K వీడియోలు రికార్డు చేయడానికి ఈ కెమెరా సెటప్ అద్భుతంగా తోడ్పడుతుంది.
5,000mAh బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
మంచి బ్యాటరీ బ్యాకప్ కోసం ఇందులో 5,000mAh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని అందించారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లతో వస్తోంది. కేవలం 218 గ్రాముల బరువు, 8.2mm మందం కలిగిన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్లాగ్‌షిప్ కెమెరా, సూపర్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ దీపావళి డీల్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.




