శాంసంగ్ కొత్త ఇయర్‌ఫోన్స్.. క్లిప్ఆన్ డిజైన్‌తో అదిరిపోయిందిగా.. ధర చూస్తే షాకే..?
Samsung Galaxy Buds On: శాంసంగ్ కొత్త Galaxy Buds On ఇయర్‌ఫోన్స్‌ను క్లిప్ఆన్ డిజైన్‌తో పరిచయం చేసింది. చెవులు మూసివేయకుండా సంగీతం వినేలా రూపొందించిన ఈ బడ్స్‌లో 9.5 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని కంపెనీ తెలిపింది.
శాంసంగ్ కొత్త ఇయర్‌ఫోన్స్.. క్లిప్ఆన్ డిజైన్‌తో అదిరిపోయిందిగా.. ధర చూస్తే షాకే..?
Samsung Galaxy Buds On: శాంసంగ్ Galaxy Buds On పేరుతో కొత్త క్లిప్ఆన్ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌ను ఆవిష్కరించింది. Galaxy Buds సిరీస్‌లో కంపెనీ తీసుకొచ్చిన తొలి క్లిప్ఆన్ మోడల్ ఇదే. చెవి లోపలికి వెళ్లే సాధారణ ఇయర్‌బడ్స్‌కు భిన్నంగా, ఇవి చెవి చుట్టూ ఉండే ఓపెన్ డిజైన్‌ను ఉపయోగిస్తాయి. దీంతో సంగీతం వింటున్న సమయంలో పరిసరాల్లోని శబ్దాలను కూడా వినే అవకాశం ఉంటుంది.
వివిధ చెవి ఆకృతులను పరిశీలించి స్పీకర్లు, బ్యాటరీని అమర్చినట్లు శాంసంగ్ తెలిపింది. కదలికల సమయంలో బడ్స్ స్థిరంగా ఉండేందుకు విస్తృత కాంటాక్ట్ ఏరియా, సర్దుబాటు చేసుకునే బ్యాండ్ ఉన్నాయి.
ఆడియో కోసం TwinBoost స్పీకర్లు, పరిసర పరిస్థితులకు అనుగుణంగా వాల్యూమ్‌ను మార్చే ఆటోమేటిక్ వాల్యూమ్ కంట్రోల్ అందించారు. Audio Leakage Reduction టెక్నాలజీ ద్వారా బయటకు వినిపించే శబ్దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.
Snapdragon S7 Gen 1 Sound Platform, Class-D యాంప్లిఫైయర్ ఇందులో ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9.5 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. మూడు మైక్రోఫోన్లు, బోన్ కండక్షన్ ఆధారిత Voice Pickup Unit సెన్సర్, మెషిన్ లెర్నింగ్ సహాయంతో కాల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను వేరు చేసే విధానాన్ని ఉపయోగించారు.
అనుకూలమైన Galaxy AI పరికరాలతో Gemini Live, Quick Voice Memo, Head Gestures వంటి హ్యాండ్స్-ఫ్రీ ఫీచర్లు పనిచేస్తాయి. Galaxy Buds On ధర KRW 299,000గా ఉంది. అక్టోబర్ 27న దక్షిణ కొరియాలో బ్లాక్ రంగులో విక్రయాలు ప్రారంభమవుతాయి. తరువాత ఇతర మార్కెట్లకు తీసుకురానున్నారు.




