రెడ్ మీ నుంచి 2 కొత్త ఫోన్స్.. 6000mAh బ్యాటరీతో పాటు మరెన్నో ఫీచర్లు.. ధరెంతంటే?
Redmi R80 5G price: షావోమి చైనా వెబ్‌సైట్‌లో రెడ్‌మీ R80 5G, R80m 5G మోడళ్లు లిస్ట్ అయ్యాయి. బడ్జెట్ వినియోగదారులకు ఇవి మంచి ఎంపికగా నిలవనున్నాయి అంచనా.
రెడ్ మీ నుంచి 2 కొత్త ఫోన్స్.. 6000mAh బ్యాటరీతో పాటు మరెన్నో ఫీచర్లు.. ధరెంతంటే?
Redmi R80 5G price: షావోమి చైనాలో కొత్త R-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకువస్తోంది. Redmi R80 5G, Redmi R80m 5G పేర్లతో రెండు మోడళ్లు Xiaomi Mall China వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యాయి. వీటి ధర, కలర్ ఆప్షన్లు, పూర్తి స్పెసిఫికేషన్లు అధికారికంగా వెల్లడయ్యాయి. అయితే కంపెనీ ఇంకా సేల్ తేదీని ప్రకటించలేదు.
ధర ఎంత?
Redmi R80 5G మూడు వేరియంట్లలో లిస్ట్ అయింది.
4GB RAM + 128GB స్టోరేజ్ – CNY 1,899 (సుమారు రూ. 24,000)
6GB RAM + 128GB స్టోరేజ్ – CNY 2,199 (సుమారు రూ. 28,000)
6GB RAM + 256GB స్టోరేజ్ – CNY 2,599 (సుమారు రూ. 34,000)
Redmi R80m 5G రెండు వేరియంట్లలో వస్తోంది.
6GB + 128GB – CNY 2,199
6GB + 256GB – CNY 2,599
రెండు ఫోన్లు నాలుగు కలర్లలో లభించనున్నాయి.
స్పెసిఫికేషన్లు..
రెండు మోడళ్లలోనూ 6.9-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. HD+ (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తోంది. కళ్లకు మేలు చేసేలా బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి.
పెర్ఫార్మెన్స్ కోసం మీడియా టెక్ 6300 చిప్‌సెట్ ఇచ్చారు. LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్‌తో పనిచేస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌గా హైపర్ ఓఎస్ 3 ఉంటుంది.
కెమెరా, బ్యాటరీ..
వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందువైపు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. పవర్ కోసం 6,000mAh భారీ బ్యాటరీ ఇచ్చారు. యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, వైబ్రేషన్ మోటార్ వంటి సెన్సార్లు ఉన్నాయి.
బడ్జెట్ 5G విభాగంలో పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ కోరుకునే వారికి R80 సిరీస్ మంచి ఆప్షన్‌గా నిలవనుంది. ఇండియా లాంచ్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.




