Redmi 17C Price: రెడ్‌మీ 17C vs పోకో M8x vs వన్‌ప్లస్ N6x.. ఏది బెస్ట్..?

Redmi 17C Price: రెడ్‌మీ 17C భారత్‌లో విడుదలైంది. పోకో M8x 5G, వన్‌ప్లస్ N6xలకు ఇది ప్రత్యర్థిగా నిలుస్తోంది. ధర, డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యాల్లో ఈ మూడు ఫోన్ల మధ్య ఆసక్తికరమైన తేడాలు ఉన్నాయి.

Venkat
Published on: 4 Oct 2026 6:00 PM IST
Redmi 17C Price
X

Redmi 17C Price: రెడ్‌మీ 17C vs పోకో M8x vs వన్‌ప్లస్ N6x.. ఏది బెస్ట్..?

Redmi 17C Price: రెడ్‌మీ 17C, పోకో M8x 5G, వన్‌ప్లస్ N6x మూడు ఫోన్లు ఒకే ధర విభాగంలో పోటీ పడుతున్నాయి. రెడ్‌మీ 17Cలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్, 4GB లేదా 6GB RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. దీని ధర 4GB+128GB వేరియంట్‌కు రూ.20,999, 6GB+128GB మోడల్‌కు రూ.22,999గా ఉంది.

పోకో M8x 5G కూడా ఇదే ధరతో ప్రారంభమవుతుంది. 4GB+128GB ధర రూ.20,999 కాగా, 6GB+128GB ధర రూ.22,999. ఇందులో స్నాప్ డ్రాగన్ 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh బ్యాటరీ ఉన్నాయి. 45W వైర్డ్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.

వన్‌ప్లస్ N6x మాత్రం ఈ మూడింటిలో తక్కువ ప్రారంభ ధరను కలిగి ఉంది. 4GB+64GB మోడల్ రూ.18,999, 4GB+128GB వేరియంట్ రూ.20,999. ఇందులో మీడియాటెక్ డైమెన్సీటి 6360 Apex ప్రాసెసర్, 7,000mAh బ్యాటరీ, 15W వైర్డ్ ఛార్జింగ్ ఉన్నాయి.

డిస్‌ప్లే పరంగా రెడ్‌మీ 17C, పోకో M8x 5Gలో 6.9 అంగుళాల HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. వన్‌ప్లస్ N6xలో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. మూడు ఫోన్లకు IP64 రేటింగ్ ఉంది.

కెమెరాల విషయానికి వస్తే రెడ్‌మీ 17C, పోకో M8x 5Gలో 50MP ప్రధాన వెనుక కెమెరా ఉంది. వన్‌ప్లస్ N6xలో 13MP వెనుక కెమెరా ఉంది. బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్ ప్రాధాన్యమైతే పోకో M8x 5G ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సమతుల్య స్పెక్స్ కోరుకునేవారికి రెడ్‌మీ 17C, తక్కువ ప్రారంభ ధర కోరుకునేవారికి వన్‌ప్లస్ N6x ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.