Smartphone Battery Tips: ఫోన్ వాడకపోయినా బ్యాటరీ ఖాళీ అవుతోందా? వెంటనే ఈ సెట్టింగ్స్ చెక్ చేయండి!

Smartphone Battery Tips: స్మార్ట్‌ఫోన్‌ను పెద్దగా ఉపయోగించకపోయినా బ్యాటరీ వేగంగా తగ్గిపోతుంటే బ్యాటరీనే తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను మెరుగుపరుచుకోవచ్చు.

Venkat
Published on: 26 Oct 2026 9:28 PM IST
Smartphone Battery Tips
X

Smartphone Battery Tips: ఫోన్ వాడకపోయినా బ్యాటరీ ఖాళీ అవుతోందా? వెంటనే ఈ సెట్టింగ్స్ చెక్ చేయండి!

Smartphone Battery Tips: చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో ఫోన్ ఉపయోగించకపోయినా బ్యాటరీ వేగంగా తగ్గిపోవడం ఒకటి. ఉదయం ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసినా కొన్ని గంటల తర్వాత చూస్తే బ్యాటరీ శాతం గణనీయంగా తగ్గిపోయి ఉంటుంది. ఫోన్ చేతిలో లేకపోయినా బ్యాటరీ ఎందుకు ఖాళీ అవుతోందనే సందేహం కలుగుతుంది.

బ్యాటరీ పాడైపోయిందని వెంటనే అనుకోవద్దు..

ఫోన్ పాతదైనా, కొత్తదైనా ఇలాంటి సమస్య రావచ్చు. ప్రతిసారీ బ్యాటరీలో లోపం ఉందని అర్థం కాదు. కొన్ని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివ్‌గా ఉండటం, అవసరం లేని అనుమతులు కొనసాగడం వంటి కారణాలతో కూడా పవర్ వినియోగం పెరుగుతుంది. అందుకే ముందుగా ఫోన్‌లో ఏ యాప్ ఎక్కువ బ్యాటరీ వినియోగిస్తుందో చెక్ చేయడం మంచిది.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌పై ఓసారి దృష్టి పెట్టండి..

వాట్సప్, ఇన్ స్టా, షాపింగ్ యాప్స్ వంటి కొన్ని అప్లికేషన్లు స్క్రీన్‌పై కనిపించకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంటాయి. డేటా సింక్, మెసేజ్ చెకింగ్, ఇతర కార్యకలాపాల కోసం ఇవి కొంత బ్యాటరీ వినియోగించవచ్చు.

ఫోన్ బ్యాటరీ యుసేజ్ సెక్షన్‌లోకి వెళ్లి ఎక్కువ పవర్ తీసుకుంటున్న యాప్స్‌ను గుర్తించండి. అవసరం లేని యాప్స్‌కు బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని పరిమితం చేయవచ్చు.

లోకేషన్ ఎప్పుడూ ఆన్ లో ఉందా?

కొన్ని యాప్స్‌కు ప్రతి సమయంలో మీ లొకేషన్ అవసరం ఉండదు. అయినా ఎలో ఆల్ ద టైం అనుమతి ఇచ్చి ఉంటే యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న సమయంలో కూడా లొకేషన్ యాక్సెస్ చేయవచ్చు.

అవసరం లేని యాప్స్‌కు ఎలో ఓన్లీ వైల్ యూజింగ్ ది ఆప్ ఆప్షన్ ఎంచుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల అవసరమైన సమయంలో మాత్రమే లొకేషన్ యాక్సెస్ లభిస్తుంది.

బలహీనమైన నెట్‌వర్క్ కూడా కారణమే..

సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఫోన్ మెరుగైన నెట్‌వర్క్ కోసం నిరంతరం ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా 4G, 5G మధ్య తరచుగా మారే పరిస్థితుల్లో పవర్ వినియోగం పెరగవచ్చు.

మీ ప్రాంతంలో 5G సిగ్నల్ స్థిరంగా లేకపోతే అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లో 4Gని ఉపయోగించడం కొన్ని సందర్భాల్లో బ్యాటరీ వినియోగాన్ని తగ్గించవచ్చు.

నోటిఫికేషన్లు, సాఫ్ట్‌వేర్ లపై కూడా..

నిరంతరం వచ్చే నోటిఫికేషన్ల కారణంగా స్క్రీన్ లేదా ఇతర ఫోన్ ఫీచర్లు తరచుగా యాక్టివ్ కావచ్చు. అవసరం లేని యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది.

అలాగే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను తాజా వెర్షన్‌లో ఉంచడం మంచిది. ఏదైనా యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌లో సమస్య ఉంటే దాని వల్ల కూడా అసాధారణ బ్యాటరీ డ్రెయిన్ కనిపించవచ్చు.

చివరగా బ్యాటరీ హెల్త్ చెక్ చేయండి..

ఈ సెట్టింగ్స్ మార్చిన తర్వాత కూడా బ్యాటరీ చాలా వేగంగా తగ్గుతుంటే బ్యాటరీ హెల్త్ చెక్ చేయాలి. బ్యాటరీ పాతబడటం లేదా దాని సామర్థ్యం తగ్గడం వల్ల కూడా బ్యాకప్ గణనీయంగా పడిపోవచ్చు.

అందుకే బ్యాటరీ డ్రెయిన్ కనిపించిన వెంటనే బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేదు. ముందుగా బ్యాటరీ యుసేజ్, బ్యాక్ గ్రౌండ్ యాప్స్, లొకేషన్ పర్మిషన్, నెట్ వర్మ్ సెట్టింగ్స్, నోటిఫికేషన్స్ వంటి అంశాలను పరిశీలించడం ద్వారా అసలు కారణాన్ని గుర్తించవచ్చు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.