ఒప్పో నుంచి అదిరిపోయే ఫోన్.. 200ఎంపీ కెమెరాతోపాటు భారీ బ్యాటరీ.. రిలీజ్ ఎప్పుడంటే?
Oppo find x10 series: ఒప్పో కొత్త Find X10 సిరీస్‌ను అక్టోబర్ 21న స్పెయిన్‌లో పరిచయం చేయనుంది. 200MP కెమెరాలు, భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్లపై ఇప్పుడు ఆసక్తి పెరిగింది.
ఒప్పో నుంచి అదిరిపోయే ఫోన్.. 200ఎంపీ కెమెరాతోపాటు భారీ బ్యాటరీ.. రిలీజ్ ఎప్పుడంటే?
oppo find x10 series: ఒప్పో (OPPO) నుంచి కొత్త Find X10 సిరీస్ అక్టోబర్ 21న స్పెయిన్‌లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం కానున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో డిజైన్, కెమెరా, పనితీరు, బ్యాటరీ విభాగాల్లో గణనీయమైన మార్పులు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ధర, పూర్తి ఫీచర్లు, భారత మార్కెట్లో విడుదలపై సంస్థ అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.
డిజైన్ పరంగా ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్‌తో ఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వెనుక కెమెరా మాడ్యూల్‌ను బాడీకి అనుగుణంగా రూపొందించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రో మ్యాక్స్ మోడల్లో రెండు రంగుల కలయిక, ఆరెంజ్ రింగ్ డిజైన్ ప్రత్యేకంగా కనిపించనున్నట్లు ప్రచారం ఉంది.
కెమెరాల విషయంలో ఈ సిరీస్ ప్రత్యేకంగా నిలవనుంది. లూమో ట్రూ ఇమేజ్ ఇంజిన్, హ్యాసెల్‌బ్లాడ్ కెమెరా టెక్నాలజీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. Find X10లో రెండు 200 మెగాపిక్సెల్ కెమెరాలు, ప్రో మ్యాక్స్‌లో మూడు 200 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండవచ్చని సమాచారం. 8కే వీడియో రికార్డింగ్ సదుపాయం కూడా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ ప్రాసెసర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రో మ్యాక్స్‌లో 2ఎన్ఎం చిప్సెట్ ఉండవచ్చని సమాచారం. గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.
బ్యాటరీ విషయంలో 8,000ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ వస్తుందని ప్రచారం జరుగుతోంది. కలర్ఓఎస్ 17తో ఫోన్ పనిచేయనున్నట్లు కూడా సమాచారం. అక్టోబర్ 21న జరిగే కార్యక్రమంలో ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, భారత్ విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




