భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఒప్పో ఎఫ్35 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. ధర, ఫీచర్లు ఇవే..!
Oppo F35 Pro 5G: భారత మార్కెట్లో ఒప్పో ఎఫ్ సిరీస్ ప్రవేశపెట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సరికొత్త ఎఫ్35 ప్రొ 5జీ, ఎఫ్35 5జీ ఫోన్లను ఆవిష్కరించారు.
భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఒప్పో ఎఫ్35 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. ధర, ఫీచర్లు ఇవే..!
Oppo F35 Pro 5G: భారత మార్కెట్లోకి ఒప్పో సంస్థ నుంచి సరికొత్త ఎఫ్35 ప్రొ 5జీ, ఎఫ్35 5జీ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఎఫ్ సిరీస్ వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఈ లేటెస్ట్ లైనప్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. ఈ నెలలోనే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అలాగే ఒప్పో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. కొనుగోలుదారుల కోసం 10 శాతం తక్షణ బ్యాంక్ డిస్కౌంట్, 10 శాతం ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నారు.
ధరల విషయానికి వస్తే, ఎఫ్35 5జీ బేస్ వేరియంట్ ధర రూ. 38,999 ఉండగా, 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 42,999గా ఉంది. ఇక ఎఫ్35 ప్రొ 5జీ ధర రూ. 45,999 నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ. 54,999 వరకు ఉంది. ప్రొ మోడల్ సన్‌సెట్ ఆరెంజ్, ఇలైట్ బ్రౌన్, వేవ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్ మిస్ట్ పింక్, టైటానియం గ్రే, వేవ్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ఫీచర్ల పరంగా రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16.5పై పనిచేస్తాయి. ప్రొ మోడల్‌లో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. స్టాండర్డ్ మోడల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.57-అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఇచ్చారు. రెండు ఫోన్‌లు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ రేటింగ్‌లను కలిగి ఉన్నాయి.
ప్రాసెసర్ పరంగా ప్రొ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మాక్స్ చిప్‌సెట్, సాధారణ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మాక్స్ చిప్‌సెట్ అమర్చారు. రెండు హ్యాండ్‌సెట్‌లలోనూ 8,000mAh భారీ బ్యాటరీతో పాటు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు పొందుపరిచారు.




