ఒప్పో ఫోన్లలో ఏఐ వాడాలంటే ఇక నెలనెలా డబ్బు కట్టాలా..? సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు ఇవే..!
OPPO ColorOS AI subscription: ఒప్పో తన కలర్‌ఓఎస్ ఏఐ ఫీచర్ల కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు తీసుకురావచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. వీటి ధర నెలకు రూ.289 నుంచి మొదలు కావచ్చు.
ఒప్పో ఫోన్లలో ఏఐ వాడాలంటే ఇక నెలనెలా డబ్బు కట్టాలా..? సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు ఇవే..!
OPPO ColorOS AI subscription: ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ కొన్న తర్వాత అందులో ఉండే ఏఐ ఫీచర్లను యూజర్లు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా వాడుకునేవారు. కానీ రాబోయే రోజుల్లో ఇది మారవచ్చు. ఒప్పో (OPPO) తన స్మార్ట్‌ఫోన్లలో ఉండే కొన్ని ఏఐ ఫీచర్ల కోసం డబ్బు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అంటే ఫోన్ కొన్న తర్వాత కొన్ని ప్రత్యేక ఏఐ ఫీచర్లను వాడాలంటే, ప్రతి నెలా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి రావచ్చు. రిపోర్టుల ప్రకారం కలర్‌ఓఎస్ (ColorOS)లో ఏఐ ఫీచర్ల కోసం ఒప్పో మూడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకురావచ్చు. వీటి ప్రారంభ ధర నెలకు రూ.289. అయితే కంపెనీ దీన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
మూడు ప్లాన్లు.. ఏఐ క్రెడిట్లు..
రిపోర్టుల ప్రకారం ఒప్పో ప్లాన్లు బేసిక్, ప్రో, అల్ట్రా కావచ్చు.
బేసిక్ ప్లాన్ రూ.289 (నెలవారీ ధర) 20,000 (AI క్రెడిట్లు) సుమారు 50 సార్లు, 100 నిమిషాలు
ప్రో రూ.579 50,000, 125, ఫోటో ఎడిట్లు, 250 నిమిషాలు
అల్ట్రా, రూ.959, 1 లక్ష, 250 ఫోటోలు, 500 నిమిషాలు
ఏ ఫీచర్లకు డబ్బు కట్టాలి?
ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, మూడు AI ఫీచర్ల కోసం క్రెడిట్లు ఖర్చు చేయాల్సి రావచ్చు.
లైవ్ ట్రాన్స్‌లేషన్ (Live Translation)
ఏఐ ఫోటో ఏజెంట్ (AI Photo Agent)
ట్రాన్స్‌క్రిప్షన్ (Transcription)
క్రెడిట్లు అయిపోతే ఏమవుతుంది?
నెల మధ్యలో AI క్రెడిట్లు అయిపోతే, వేరుగా క్రెడిట్లు కొనే ఆప్షన్ లభించవచ్చు.
ప్రారంభ ధర రూ.189. ఇందులో 10,000 క్రెడిట్లు లభించవచ్చు.
రూ.369, రూ.759, రూ.1,439 టాప్-అప్ ప్యాక్‌లు కూడా రావచ్చు.
ఈ టాప్-అప్‌ల వాలిడిటీ ఒక ఏడాది ఉండవచ్చు.
శుభవార్త ఏంటంటే, ఫోన్‌లోని మిగిలిన ప్రాథమిక ఏఐ ఫీచర్లు ప్రస్తుతానికి ఉచితంగానే ఉండే అవకాశం ఉంది.




