చాట్‌జీపీటీలో కొత్త ఏఐ టూల్ వచ్చేసింది.. ఇకపై నిమిషాల్లోనే ఇచ్చిపడేస్తది..!
OpenAI Codex AI Agent: చాట్‌జీపీటీ సైడ్‌బార్ ద్వారా కోడెక్స్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ప్రాంప్ట్ రూపంలో కొత్త ప్రోగ్రామింగ్ పనులను కేటాయించడం ద్వారా 1 నుంచి 30 నిమిషాల వ్యవధిలో పనులు పూర్తవుతాయి.
చాట్‌జీపీటీలో కొత్త ఏఐ టూల్ వచ్చేసింది.. ఇకపై నిమిషాల్లోనే ఇచ్చిపడేస్తది..!
OpenAI Codex AI agent: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో టెక్ దిగ్గజం ఓపెన్‌ఏఐ (OpenAI) మరో సంచలన అడుగు వేసింది. చాట్‌జీపీటీ (ChatGPT) వేదికగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ పనులను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త క్లౌడ్-బేస్డ్ కోడింగ్ ఏజెంట్ 'కోడెక్స్' (Codex) ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రోగ్రామింగ్ పనుల్లో ఏఐ పాత్రను మరింత విస్తృతం చేసే ఉద్దేశంతో ఈ అత్యాధునిక టూల్‌ను పరిచయం చేశారు.
కోడెక్స్ చేసే పనులు ఏమిటి?
సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, కోడింగ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ ఏజెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒకే సమయంలో పలు రకాల డెవలప్‌మెంట్ పనులను ఒకే టైంలో నిర్వహించగలదు.
కొత్త కోడింగ్‌ను వేగంగా రాయడం.
సాఫ్ట్‌వేర్‌లోని బగ్స్‌ను గుర్తించి ఆటోమేటిక్‌గా సరిదిద్దడం.
యూజర్ల కోడ్‌బేస్‌కు సంబంధించి ఏవైనా సాంకేతిక సందేహాలు వస్తే వాటికి క్షణాల్లో సమాధానాలు ఇవ్వడం.
ఫీచర్ ఇంప్లిమెంటేషన్ మరియు కోడ్ రివ్యూ కోసం పుల్ రిక్వెస్ట్‌లను సృష్టించడం.
అధునాతన 'o3' రీజనింగ్ మోడల్ శక్తి..
ఓపెన్‌ఏఐకి చెందిన శక్తివంతమైన 'o3' రీజనింగ్ మోడల్ కస్టమైజ్డ్ వెర్షన్ ద్వారా కోడెక్స్ రన్ అవుతుంది. రియల్-వరల్డ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వాతావరణంలో రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ద్వారా దీనికి శిక్షణనిచ్చారు. దీంతో ఇది డెవలపర్లు ఇచ్చే సూచనలను అత్యంత ఖచ్చితంగా అర్థం చేసుకుని, సక్సెస్‌ఫుల్ రిజల్ట్ వచ్చే వరకు రిపీటెడ్‌గా టెస్ట్‌లను రన్ చేయగలదు. ప్రతి పని కూడా యూజర్ ప్రాజెక్ట్ రిపోజిటరీతో కూడిన సురక్షితమైన క్లౌడ్ శాండ్‌బాక్స్‌లోనే విడిగా అమలవుతుంది.
ఎవరికి అందుబాటులో ఉంటుంది?
ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను ChatGPT ప్రో, ఎంటర్‌ప్రైజ్, టీమ్ ప్లాన్‌ల సబ్‌స్క్రైబర్లకు దశలవారీగా విడుదల చేయడం ప్రారంభించారు. త్వరలోనే ప్లస్ (Plus), ఎడ్యు (Edu) ప్లాన్ యూజర్లకు కూడా ఈ సపోర్ట్ రానున్నట్లు తెలుస్తోంది.
ఎలా ఉపయోగించాలి?
చాట్‌జీపీటీ సైడ్‌బార్ ద్వారా కోడెక్స్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ప్రాంప్ట్ రూపంలో కొత్త ప్రోగ్రామింగ్ పనులను కేటాయించడం ద్వారా 1 నుంచి 30 నిమిషాల వ్యవధిలో పనులు పూర్తవుతాయి. కోడ్ ఫైల్స్‌ను చదవడం, సవరించడం, టెస్ట్ సూట్‌లను రన్ చేయడం వంటి అన్ని పనులను ఇది స్వయంచాలకంగా నిర్వహించగలదు. కోడింగ్ నిపుణులకు ఈ టూల్ ఒక అద్భుతమైన డిజిటల్ అసిస్టెంట్‌గా నిలవనుంది!




