OnePlus ColorOS: వన్‌ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ ఫోన్ లిస్ట్‌లో ఉందా..?

OnePlus ColorOS 17: వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కీలక అప్‌డేట్ వచ్చింది. కంపెనీ ప్రకటించిన షెడ్యూల్ కంటే ముందుగానే కొన్ని ఫోన్లకు ColorOS 17 స్టేబుల్ అప్‌డేట్‌ను విడుదల చేస్తోంది.

Venkat
Published on: 29 Oct 2026 9:21 PM IST
OnePlus ColorOS
X

OnePlus ColorOS: వన్‌ప్లస్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీ ఫోన్ లిస్ట్‌లో ఉందా..?

OnePlus ColorOS 17: వన్‌ప్లస్ తన స్మార్ట్‌ఫోన్లకు కొత్త కలర్ ఓస్ 17 అప్‌డేట్‌ను వేగంగా అందిస్తోంది. కంపెనీ కమ్యూనిటీ ఫోరమ్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, కొన్ని డివైజ్‌లకు నిర్ణయించిన తేదీ కంటే ముందే స్టేబుల్ అప్‌డేట్ అందడం ప్రారంభమైంది.

ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందించిన కలర్ ఓస్ 17లో గూగుల్ అందించే కొత్త ఫీచర్లతో పాటు ఒప్పో, వన్ ప్లేస్ తమ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని మెరుగుపరిచేలా ప్రత్యేక మార్పులు చేశాయి.

షెడ్యూల్ కంటే ముందే అప్‌డేట్..

మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వన్ ప్లేస్ 15, వన్ ప్లస్ పాడ్ 4లకు అక్టోబర్ 29 నుంచి ColorOS 17 అప్‌డేట్ రావాల్సి ఉంది. అయితే ఈ రెండు డివైజ్‌లకు అక్టోబర్ 22 నుంచే స్టేబుల్ అప్‌డేట్ అందడం ప్రారంభమైంది.

ఆ తర్వాత వన్ ప్లస్ 15R, వన్ ప్లస్ 13s, వన్ ప్లస్ 13 మోడళ్లకు కూడా షెడ్యూల్ కంటే ముందే అప్‌డేట్ విడుదల చేసినట్లు కంపెనీ కమ్యూనిటీ ఫోరమ్‌లో పేర్కొంది.

నవంబర్‌లో ఈ ఫోన్లకు..

కలర్ ఓఎస్ 17 అప్‌డేట్ రాబోయే నెలల్లో మరిన్ని వన్ ప్లస్ డివైజ్‌లకు అందనుంది.

నవంబర్ 2026:

OnePlus Open

OnePlus 13R

OnePlus 12

OnePlus Nord 6

OnePlus Nord CE6

OnePlus Pad 3

డిసెంబర్‌లో ఈ మోడళ్లకు..

డిసెంబర్ 2026:

OnePlus 12R

OnePlus 12R Genshin Impact Edition

OnePlus 11

OnePlus Nord 5

OnePlus Nord CE6 Lite

OnePlus Nord CE5

OnePlus Pad 2

OnePlus Pad Go 2

2027 తొలి త్రైమాసికంలో కొన్ని పాత మోడళ్లకు ColorOS 17 అప్‌డేట్ 2027 తొలి త్రైమాసికంలో అందించనున్నట్లు షెడ్యూల్‌లో ఉంది.

OnePlus Nord 4

OnePlus N6

OnePlus N6x

OnePlus N6 Lite

OnePlus Pad Lite

ColorOS 17లో కొత్తగా ఏం ఉంటుంది?

కలర్ ఓఎస్ 17లో యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత స్మూత్‌గా మార్చేందుకు వన్ ప్లస్, ఒప్పో ప్రత్యేక మార్పులు చేశాయి. యానిమేషన్లు మరింత ఫ్లూయిడ్‌గా ఉండేలా, పారదర్శక బటన్లు, ఇతర ఇంటర్‌ఫేస్ ఎలిమెంట్స్‌తో కొత్త డిజైన్‌ను అందించారు.

కంపెనీ ప్రకారం, దీనికి కొత్త తరం లుమినోస్ రెండరింగ్ ఇంజిన్ కీలకంగా పనిచేస్తుంది. ఇది ఫ్యూజ్డ్ రెండరింగ్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగిస్తుంది. లైట్ ఎఫెక్ట్స్, యూజర్ ఇంటర్‌ఫేస్ రెండింటినీ కలిపి రెండర్ చేయడం ద్వారా స్క్రీన్ అనుభవాన్ని మెరుగుపరచడమే దీని ఉద్దేశం.

నోటిఫికేషన్ డ్రాయర్‌ను కూడా రీడిజైన్ చేశారు. కొత్త వాల్‌పేపర్లు, థీమ్స్‌తో పాటు సిస్టమ్ యాప్స్ రూపంలోనూ మార్పులు కనిపిస్తాయి.

ఏఐ ఫీచర్లు కూడా..

కలర్ ఓఎస్ 17లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. మెరుగైన మైండ్ స్పేస్, ఏఐ సజెస్ట్, మైండ్ పైలెట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ ఫీచర్లు యూజర్ల రోజువారీ పనులను సులభతరం చేయడం, అవసరమైన సమాచారాన్ని వేగంగా అందించడం లక్ష్యంగా పనిచేస్తాయి.

అప్‌డేట్ ఎలా చెక్ చేసుకోవాలి?

మీ వన్ ప్లస్ ఫోన్‌కు కలర్ ఓఎస్ 17 అప్‌డేట్ అందుబాటులోకి వచ్చిందో తెలుసుకోవాలంటే ఫోన్‌లో సెట్టింగ్, సిస్టం అండ్ అప్టేడ్ కు వెళ్లాలి. అక్కడ డౌన్ లోడ్ అండ్ ఇన్ స్టాల్ ఆప్షన్ కనిపిస్తే అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అయితే అప్‌డేట్ అందుబాటు మోడల్, ప్రాంతం, రోల్‌అవుట్ దశను బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి లిస్ట్‌లో మీ ఫోన్ ఉన్నప్పటికీ వెంటనే అప్‌డేట్ కనిపించకపోవచ్చు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.