Upcoming Mobiles: 200MP కెమెరా, 10000mAh బ్యాటరీ.. నవంబర్‌లో రాబోతున్న టాప్ ఫోన్లు ఇవే..!

Upcoming Mobiles: నవంబర్ 2026లో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వరుస కొత్త ఫోన్లు సందడి చేయనున్నాయి. మోటరోలా, వివో, షావోమీ, రియల్‌మీ, వన్‌ప్లస్, కార్బన్ తదితర బ్రాండ్లు కొత్త మోడళ్లను తీసుకురానున్నాయి.

Venkat
Published on: 1 Nov 2026 6:13 PM IST
Upcoming Mobiles
X

Upcoming Mobiles: 200MP కెమెరా, 10000mAh బ్యాటరీ.. నవంబర్‌లో రాబోతున్న టాప్ ఫోన్లు ఇవే..!

Upcoming Mobiles: నవంబర్ 2026లో మొబైల్ కొనాలని చూస్తున్న వారికి చాలా ఆప్షన్లు కనిపించనున్నాయి. ఈ నెలలో బడ్జెట్ విభాగం నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడళ్ల వరకు పలు ఫోన్లు భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే వీటిలో కొన్ని మోడళ్లకు మాత్రమే లాంచ్ తేదీలు అధికారికంగా ఖరారయ్యాయి. మిగిలిన వాటి వివరాలు ప్రస్తుతం లీకులు, అంచనాల ఆధారంగా ఉన్నాయి.

మోటరోలా సిగ్నేచర్ 27

నవంబర్‌లో ఎక్కువగా ఆసక్తి రేపుతున్న ఫోన్లలో మోటరోలా సిగ్నేచర్ 27 (Motorola Signature 27) ఒకటి. నవంబర్ 5న ఈ ఫోన్ లాంచ్ కానుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 50MP సోనీ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనున్నట్లు సమాచారం. బాంగ్, ఒలుఫ్సెన్ ట్యూన్ చేసిన స్పీకర్లు, ఏడు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి.

వివో X500 సిరీస్

వివో X500 సిరీస్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. X500, X500 ప్రో, X500 ప్రో మ్యాక్స్ మోడళ్లు భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా X500 ప్రో మ్యాక్స్‌లో 200MP టెలిఫోటో కెమెరా, 8,000mAh బ్యాటరీ ఉండొచ్చని సమాచారం. X500 ప్రోలో 2K 144Hz డిస్‌ప్లే, పెరిస్కోప్ కెమెరా వంటి ఫీచర్లు ఉండనున్నట్లు లీకులు చెబుతున్నాయి. అయితే భారత లాంచ్ తేదీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

రియల్‌మీ 17 ప్రో సిరీస్..

రియల్‌మీ 17 ప్రో సిరీస్ కూడా నవంబర్‌లో రావచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో 10,000mAh వరకు భారీ బ్యాటరీ, 200MP ప్రధాన కెమెరా వంటి ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. టాప్ మోడల్‌లో 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉండొచ్చని తెలుస్తోంది. గేమింగ్, భారీ బ్యాటరీ కోరుకునే వారికి ఈ సిరీస్ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 16R..

వన్‌ప్లస్ 16R కూడా నవంబర్ లాంచ్ జాబితాలో కనిపిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, అమోలెడ్ డిస్‌ప్లే, 8,500mAh వరకు బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. అయితే దీని లాంచ్ తేదీ ఇంకా ఖరారు కాలేదు. తాజా అంచనాల్లో ఈ ఫోన్ డిసెంబర్‌కు వెళ్లే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

షావోమీ 18 ప్రో..

ఫ్లాగ్‌షిప్ విభాగంలో షావోమీ 18 ప్రో (Xiaomi 18 Pro)పై కూడా ఆసక్తి ఉంది. భారత మార్కెట్‌కు ఈ ఫోన్ వస్తుందని కంపెనీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్, వెనుక చిన్న సెకండరీ డిస్‌ప్లే, 200MP + 200MP + 50MP కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. అయితే ఖచ్చితమైన భారత లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు.

కార్బన్ రెబెల్ సిరీస్..

భారతీయ బ్రాండ్ కార్బన్ (Karbonn) కూడా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి తిరిగి వస్తోంది. రెబెల్, రెబెల్ ప్రో 5G మోడళ్లను నవంబర్ 2న తీసుకురానున్నట్లు సమాచారం. రెబెల్‌లో 7,000mAh బ్యాటరీ ఉండనుండగా, రెబెల్ ప్రోలో 120Hz డిస్‌ప్లే, 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

ఇంకా ఏ ఫోన్లు?

మోటరోలా ఎడ్జ్ 70 నియో 5G, వివో V80 FE, వివో Y32 5G, POCO X8s 5G, వొబుల్ స్పీడ్ 5G, టెక్నో స్పార్క్ 50C వంటి మోడళ్లు కూడా నవంబర్ లాంచ్ జాబితాలో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని ఫోన్లకు ఖచ్చితమైన భారత లాంచ్ తేదీ ఇంకా లేదు.

మొత్తంగా చూస్తే నవంబర్ 2026లో కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే, పనితీరుపై కంపెనీలు ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా 200MP కెమెరాలు, 7,000–10,000mAh బ్యాటరీలు, 144Hz–165Hz డిస్‌ప్లేలు ఈ నెల మొబైల్ మార్కెట్‌లో కీలక ట్రెండ్‌గా మారే అవకాశం ఉంది. అయితే ఫోన్ కొనేముందు అధికారిక ధర, లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లు నిర్ధారించుకోవడం మంచిది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.