200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో మోటోరోలా సిగ్నేచర్ 27.. డిసెంబర్ 9న భారత్‌లో లాంచ్..!

Motorola Signature 27 India Launch: మోటోరోలా తన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సిగ్నేచర్ 27ను భారత్‌లో డిసెంబర్ 9న లాంచ్ చేయనుంది. కంపెనీ లాంచ్ తేదీని ధ్రువీకరించింది.

Venkat
Published on: 24 Nov 2026 6:23 PM IST
Motorola Signature 27 India Launch
X

200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో మోటోరోలా సిగ్నేచర్ 27.. డిసెంబర్ 9న భారత్‌లో లాంచ్..!

Motorola Signature 27 India Launch: మోటోరోలా సిగ్నేచర్ 27 ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో విడుదలైంది. అక్కడ దీని ప్రారంభ ధర 1,599 డాలర్లు (సుమారు రూ.1.51 లక్షలు). భారత్‌లో లాంచ్ గురించి అక్టోబర్‌లో ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో కంపెనీ ధ్రువీకరించింది. తాజాగా డిసెంబర్ 9 తేదీని ప్రకటించింది. ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు ఇవే.

1. 200MP పెరిస్కోప్ కెమెరా..

200MP పెరిస్కోప్ కెమెరా ద్వారా దూరంలోని వస్తువులను కూడా దగ్గరగా ఫోటో తీయవచ్చు.

3.5X ఆప్టికల్ జూమ్, 100X డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉన్నాయి.

2. కెమెరా సెటప్..

వెనుక మూడు కెమెరాలు: 200MP పెరిస్కోప్ కెమెరా, 50MP సోనీ లైటియా L910 (Sony LYTIA L910) మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా.

సెల్ఫీ కోసం 50MP ఫ్రంట్ కెమెరా.

3. డిస్‌ప్లే..

6.8 అంగుళాల ఎక్స్‌ట్రీమ్ AMOLED డిస్‌ప్లే.

120Hz రిఫ్రెష్ రేట్, స్క్రోలింగ్, వీడియో చూడటం స్మూత్‌గా ఉంటుంది.

పీక్ బ్రైట్‌నెస్ 12,000 నిట్స్ వరకు ఉంటుందని చెప్పారు.

4. ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్..

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్.

16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్. భారీ యాప్‌లు, గేమ్స్ సులభంగా నడుస్తాయి.

5. బ్యాటరీ, ఛార్జింగ్..

7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ.

90W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

6. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్..

మోటోరోలా 7 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 7 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని హామీ ఇస్తోంది.

7. ఆడియో..

బ్యాంక్, ఒలుఫ్‌సన్ ట్యూనింగ్‌తో స్టీరియో స్పీకర్లు. మ్యూజిక్, వీడియో అనుభవం మెరుగవుతుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.