200MP పెరిస్కోప్ కెమెరాతో మోటోరోలా సిగ్నేచర్ 27.. భారత్‌లో లాంచ్‌కు రెడీ..!
Motorola Signature 27: మోటోరోలా తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిగ్నేచర్ 27ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ నవంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా తేదీని ప్రకటించలేదు.
200MP పెరిస్కోప్ కెమెరాతో మోటోరోలా సిగ్నేచర్ 27.. భారత్‌లో లాంచ్‌కు రెడీ..!
Motorola Signature 27: మోటోరోలా సిగ్నేచర్ 27 భారత్‌లో త్వరలో లాంచ్ కానుంది. ఇది పెర్ఫార్మెన్స్, ఫోటోగ్రఫీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ఫ్లాగ్షిప్ ఫోన్. కంపెనీ అధికారిక పోర్టల్‌లో ఇప్పటికే టీజర్ విడుదలైంది. అందులో ఫోన్ డిజైన్ కనిపించింది. సెప్టెంబర్‌లో జరిగిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో మోటోరోలా ఈ ఫోన్‌ను తొలిసారి పరిచయం చేసింది.
పవర్ఫుల్ ప్రాసెసర్..
క్వాల్కమ్ అత్యంత శక్తివంతమైన చిప్సెట్ అయిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6ను ఇందులో వాడారు. భారీ గేమింగ్, మెరుగైన కెమెరా ఫలితాలు, ఆన్-డివైస్ AI టాస్కులను ఈ ఫోన్ సులభంగా హ్యాండిల్ చేయగలదని కంపెనీ చెబుతోంది.
ఆర్క్టిక్మెష్ కూలింగ్ సిస్టమ్..
ఫోన్ వేడెక్కకుండా ఆర్క్టిక్మెష్ (ArcticMesh) కూలింగ్ సిస్టమ్‌ను ఇచ్చినట్లు మోటోరోలా తెలిపింది. ఇది పాత మోడల్‌తో పోలిస్తే 40 శాతం పెద్దదని కంపెనీ చెబుతోంది.
కెమెరా ఫీచర్లు..
ప్రధాన కెమెరాగా సోనీ లైటియా 910 (Sony LYTIA 910) 50MP సెన్సార్ ఉంది. దూరంలోని వస్తువులనూ హై రిజల్యూషన్‌లో క్యాప్చర్ చేసేందుకు 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. ఫోటోలు, వీడియోల్లో బ్లర్ రాకుండా 3.5 యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంది. ఇది తక్కువ వెలుతురులోనూ మెరుగైన పనితీరు ఇవ్వగలదు.
సాఫ్ట్వేర్ అప్డేట్స్, గ్రాఫీన్ ఓఎస్
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17తో వస్తుంది. కంపెనీ ఏడేళ్ల వరకు OS అప్డేట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. మరో ప్రత్యేకత ఏంటంటే, గ్రాఫీన్ ఓఎస్ (GrapheneOS) సపోర్ట్‌తో వస్తున్న ఫోన్ ఇదే. సెప్టెంబర్‌లో గ్రాఫీన్ ఓఎస్ డెవలపర్లు దీన్ని ధ్రువీకరించారు. గూగుల్ పిక్సెల్ ఫోన్ల తర్వాత ఈ ప్లాట్‌ఫామ్‌ను సపోర్ట్ చేసే తొలి ఫోన్ మోటోరోలా సిగ్నేచర్ 27. స్టాండర్డ్ ఆండ్రాయిడ్‌తో పోలిస్తే గ్రాఫీన్ ఓఎస్ భిన్నమైనది. ఇది టాప్ క్లాస్ సెక్యూరిటీని అందిస్తుంది.




