మైక్రోవేవ్‌లో ఆహారం వేడెక్కుతుంది కానీ ప్లేట్ ఎందుకు కాదు.. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది..?
Microwave Heating Technology: మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడానికి పెట్టినప్పుడు, కొద్దిసేపట్లోనే ఆహారం వేడెక్కుతుంది. కానీ దాన్ని పెట్టిన ప్లేట్ మాత్రం తరచూ చల్లగా ఉంటుంది.
మైక్రోవేవ్‌లో ఆహారం వేడెక్కుతుంది కానీ ప్లేట్ ఎందుకు కాదు.. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది..?
Microwave Heating Technology: మైక్రోవేవ్‌లో ఆహారం వేడి చేసేటప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించి ఉంటారు. ఆహారం కొద్ది సమయంలోనే వేడెక్కుతుంది, కానీ దాన్ని పెట్టిన ప్లేట్ ఉష్ణోగ్రత దాదాపు అలాగే ఉంటుంది. చాలామంది దీని కారణం గురించి గందరగోళానికి గురవుతారు. దీనికి కారణం మైక్రోవేవ్ పనిచేసే విధానమే. ఇది ఇతర వంట పరికరాల్లా నేరుగా వేడిని ఉత్పత్తి చేసి ఆహారాన్ని ఉడికించదు. ప్రత్యేకమైన విద్యుదయస్కాంత తరంగాల (ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్) సాయంతో ఆహారాన్ని లోపలి నుంచి వేడి చేస్తుంది. ఈ టెక్నాలజీని డైఇలెక్ట్రిక్ హీటింగ్ (Dielectric Heating) అంటారు.
డైఎలెక్ట్రిక్ హీటింగ్ ఎలా పనిచేస్తుంది?
మైక్రోవేవ్‌లో 2.4 నుంచి 2.45 GHz ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రత్యేక తరంగాలను ఉపయోగిస్తారు. ఈ తరంగాలు ఆహారంలో ఉన్న నీటిపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల నీటి చిన్న చిన్న కణాలు (అణువులు) వేగంగా కదులుతూ, తిరుగుతూ ఉంటాయి. ఈ కదలికతో వేడి పుడుతుంది, దాంతో ఆహారం వేడెక్కుతుంది. మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేసే ఈ విధానాన్నే డైఎలెక్ట్రిక్ హీటింగ్ అంటారు.
ప్లేట్ ఎందుకు అంతగా వేడెక్కదు?
మైక్రోవేవ్ తరంగాల ప్రభావం అన్ని వస్తువులపై ఒకేలా ఉండదు. ఆహారంలోని నీరు ఈ తరంగాల నుంచి వేడిని పుట్టిస్తుంది. కానీ గాజు, సిరామిక్ ప్లేట్లు ఈ తరంగాల వల్ల ఎక్కువగా వేడెక్కవు. అందుకే ఆహారం వేడెక్కినా ప్లేట్ ఉష్ణోగ్రత తక్కువగానే ఉంటుంది.
అయితే వేడి ఆహారం ప్లేట్‌కు తగులుతున్నప్పుడు, ఆ ఆహారం వేడి ప్లేట్‌కు కూడా చేరడం మొదలవుతుంది. అందుకే మైక్రోవేవ్ నుంచి బయటకు తీసినప్పుడు ప్లేట్ కూడా వేడిగా అనిపించవచ్చు.
మైక్రోవేవ్ లోపల ఉండే మ్యాగ్నెట్రాన్..
మైక్రోవేవ్ పనిచేయడానికి మ్యాగ్నెట్రాన్ (Magnetron) అనే ప్రత్యేక భాగం అవసరం. ఇది ఒక ట్యూబ్, మైక్రోవేవ్ తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ టెక్నాలజీని మొదట రాడార్‌లో ఉపయోగించడానికి అభివృద్ధి చేశారు.
ఓవెన్ లోపల ఒక లోహపు పొర (మెటల్ లేయర్) ఉంటుంది. అది ఈ తరంగాలు బయటకు వెళ్లకుండా అడ్డుకుని, వాటిని ఓవెన్ లోపలికే తిరిగి పంపుతుంది. దీనివల్ల మైక్రోవేవ్ సురక్షితంగా పనిచేస్తుంది.




