Lyne Originals Gadgets: రూ.349కే వైర్‌లెస్ స్పీకర్.. బడ్జెట్ ధరలోనే మరో 5 గ్యాడ్జెట్లను లాంచ్ చేసిన దేశీ బ్రాండ్..!

Lyne Originals Gadgets: స్మార్ట్‌ఫోన్ యాక్సెసరీస్ మార్కెట్లో మరో దేశీయ బ్రాండ్ సందడి చేస్తోంది. భారతీయ సంస్థ Lyne Originals ఒకేసారి ఐదు కొత్త గ్యాడ్జెట్లను విడుదల చేసింది.

Venkat
Published on: 13 Nov 2026 7:42 PM IST
Lyne Originals Gadgets
X

Lyne Originals Gadgets: రూ.349కే వైర్‌లెస్ స్పీకర్.. బడ్జెట్ ధరలోనే మరో 5 గ్యాడ్జెట్లను లాంచ్ చేసిన దేశీ బ్రాండ్..!

Lyne Originals Gadgets: బడ్జెట్ గ్యాడ్జెట్లకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందించే వైర్‌లెస్ స్పీకర్లు, నెక్‌బ్యాండ్లు, పవర్ బ్యాంకుల కోసం వినియోగదారులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారతీయ బ్రాండ్ లైన్ ఒరిజినల్స్ (Lyne Originals) ఐదు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిలో రెండు వైర్‌లెస్ స్పీకర్లు, ఒక వైర్‌లెస్ నెక్‌బ్యాండ్, రెండు పవర్ బ్యాంకులు ఉన్నాయి. వీటికి Jukebox Pro, Powerbox, Rover సిరీస్‌లలో పేర్లు పెట్టింది. ముఖ్యంగా స్పీకర్ల ధర రూ.349తో ప్రారంభం కావడం విశేషం.

రూ.349కే వైర్‌లెస్ స్పీకర్..

ఈ లాంచ్‌లో భాగంగా కంపెనీ రెండు వైర్‌లెస్ స్పీకర్లను పరిచయం చేసింది. మొదటిది Jukebox 19 Pro. లియో సిరీస్‌లో వచ్చిన ఈ స్పీకర్‌లో 52mm డ్యూయల్ స్పీకర్ డ్రైవర్లు ఉన్నాయి. 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆరు గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. బ్లూ, బ్లాక్, రెడ్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.949.

ఇక రెండో స్పీకర్ Jukebox 21 Pro. అడ్వెంచర్ సిరీస్‌లో తీసుకొచ్చిన ఈ మోడల్‌లో 52mm హార్న్‌తో 8 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ లభిస్తుంది. 10 మీటర్ల పరిధిలో వైర్‌లెస్ కనెక్టివిటీ అందిస్తుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇలాంటి రెండు స్పీకర్లను ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్, పర్పుల్, గ్రీన్, వైట్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర కేవలం రూ.349గా నిర్ణయించారు.

50 గంటల బ్యాటరీతో కొత్త నెక్‌బ్యాండ్..

మ్యూజిక్ వినేవారితో పాటు ఎక్కువసేపు కాల్స్ మాట్లాడేవారిని దృష్టిలో పెట్టుకొని Rover 29 Pro నెక్‌బ్యాండ్‌ను విడుదల చేసింది. ఇందులో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ, 10mm స్పీకర్ డ్రైవర్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల వరకు టాక్‌టైమ్, మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.

ఇందులో మాగ్నెటిక్ ఆన్/ఆఫ్ ఫీచర్, టచ్ కంట్రోల్స్, వైబ్రేషన్ అలర్ట్స్, లో లేటెన్సీ గేమ్ మోడ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. బ్లాక్, బ్లూ, గ్రే, బ్రౌన్ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.649.

10,000mAh బ్యాటరీతో రెండు పవర్ బ్యాంకులు..

ఈ లాంచ్‌లో పవర్ బ్యాంకులపైనా కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 10,000mAh సామర్థ్యంతో రెండు మోడళ్లను పరిచయం చేసింది. మొదటిది Powerbox 27 Pro. ఇందులో 33W అవుట్‌పుట్‌తో పాటు QC, PD ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం, టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నాయి. మెటాలిక్ డిజైన్‌తో బ్లాక్, వైట్, పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.1,749.

మరో మోడల్ Powerbox 31 Pro. ఇందులోనూ 10,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. 33W వైర్డ్ ఛార్జింగ్, PD ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం అందిస్తున్నారు. దీని ధర రూ.1,799గా నిర్ణయించారు.

ఐదు గ్యాడ్జెట్ల ధరలు ఇవే..

బడ్జెట్ ధరల్లో ఐదు కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చిన Lyne Originals.. స్పీకర్ల నుంచి పవర్ బ్యాంకుల వరకు విభిన్న అవసరాలకు అనుగుణంగా ఎంపికలు అందించింది. అయితే కొనుగోలు చేసే ముందు బ్యాటరీ పనితీరు, ఛార్జింగ్ వేగం, సౌండ్ క్వాలిటీ వంటి అంశాలను వినియోగదారులు పరిశీలించడం మంచిది.

ఐదు గ్యాడ్జెట్ల ధరల వివరాలు

Jukebox 21 Pro స్పీకర్ రూ.349

Jukebox 19 Pro స్పీకర్ రూ.949

Rover 29 Pro నెక్‌బ్యాండ్ రూ.649

Powerbox 27 Pro రూ.1,749

Powerbox 31 Pro రూ.1,799

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.