రూ.10,999కే 7,000mAh బ్యాటరీతో 5G ఫోన్.. నవంబర్ 4 నుంచి సేల్..!
Karbonn Rebel 5G: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి స్వదేశీ బ్రాండ్ కార్బన్ మళ్లీ అడుగుపెడుతోంది. కంపెనీ కార్బన్ రెబెల్ 5G, రెబెల్ ప్రో అనే రెండు కొత్త 5G ఫోన్లను తీసుకొస్తోంది. ఇవి రెండూ అమెజాన్‌లో లిస్ట్ అయ్యాయి.
రూ.10,999కే 7,000mAh బ్యాటరీతో 5G ఫోన్.. నవంబర్ 4 నుంచి సేల్..!
Karbonn Rebel 5G: కొంతకాలంగా మార్కెట్‌లో కనిపించని కార్బన్ ఇప్పుడు బడ్జెట్ 5G సెగ్మెంట్‌తో తిరిగొస్తోంది. రెండు ఫోన్లలోనూ పెద్ద బ్యాటరీలు, ఆండ్రాయిడ్ 16 లాంటి ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ అధికారిక పేజీలో కార్బన్ స్టోర్ బ్యానర్లు కనిపిస్తున్నాయి. అందువల్ల వీటి ఫీచర్లు బయటకు వచ్చాయి. రూ.15 వేల బడ్జెట్‌లో 5G ఫోన్ కొనాలనుకునేవారికి ఇవి ఓ ఆప్షన్ కావచ్చు.
ధర, సేల్ వివరాలు..
కార్బన్ రెబెల్ 5G: రూ.10,999
కార్బన్ రెబెల్ ప్రో: రూ.11,499
నవంబర్ 4 నుంచి అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.
కార్బన్ రెబెల్ 5G ఫీచర్లు..
6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే, 650 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్.
7,000mAh భారీ బ్యాటరీ. ఇదే ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ.
18W USB టైప్-సీ ఛార్జింగ్ సపోర్ట్.
బ్లూ, గోల్డ్, సిల్వర్ రంగుల్లో రావచ్చు.
కార్బన్ రెబెల్ ప్రో ఫీచర్లు..
6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్. దీనివల్ల స్క్రోలింగ్ స్మూత్‌గా ఉంటుంది.
6,000mAh బ్యాటరీ, 20W యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్.
బ్లూ, బర్గండీ, గోల్డ్, గ్రే రంగుల్లో రావచ్చు.
రెండు ఫోన్లలో ఉమ్మడి ఫీచర్లు..
ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తాయి.
రెండేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, రెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది.
క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్. అనవసరమైన యాప్స్ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉండవు.
3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంది.
బాక్స్‌లో ఛార్జర్, యూఎస్‌బీ టైప్-సీ కేబుల్ లభిస్తాయి.




