Jio Vs Starlink: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్‌.. జియోతో కయ్యానికి సిద్ధమైన స్టార్‌లింక్‌..!

Jio Vs Starlink: భారతదేశంలో జియో, స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ధరల విషయంలో ఎవరు ముందుంటారు?

Venkat
Published on: 21 Nov 2026 6:18 PM IST
Jio Vs Starlink
X

Jio Vs Starlink: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్‌.. జియోతో కయ్యానికి సిద్ధమైన స్టార్‌లింక్‌..!

Jio Vs Starlink: భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు జియో, స్టార్‌లింక్ పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, ఎయిర్‌టెల్ మద్దతు ఉన్న వన్‌వెబ్ (Eutelsat OneWeb)కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ లభించింది.

అయితే సెక్యూరిటీ క్లియరెన్స్, స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ మూడు కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించగలవు. దీంతో అసలు ప్రశ్న ఏమిటంటే - భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ధరల విషయంలో జియో వ్యూహాన్ని స్టార్‌లింక్ ఎదుర్కోగలదా?

జియోస్పేస్‌ఫైబర్: జియో ప్రణాళిక ఏమిటి?

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ జియో స్పెస్ ఫైబర్ (JioSpaceFiber) పై పనిచేస్తోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, రిలయన్స్ అంతరిక్షంలో 1600 ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

భారత్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీని బలోపేతం చేయడం, విదేశీ శాటిలైట్ ఆపరేటర్లపై ఆధారపడటాన్ని తగ్గించడమే జియో లక్ష్యం.

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, రిలయన్స్ ఇప్పుడు దేశీయ శాటిలైట్ తయారీ కంపెనీలు, టెక్నాలజీ స్టార్టప్‌లు మరియు పలు పెద్ద గ్రూపులతో భాగస్వామ్య అవకాశాలను అన్వేషిస్తోంది. అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని కంపెనీ భావిస్తోంది.

జియో లక్ష్యాలు ఇలా ఉన్నాయి:

సెప్టెంబర్ 2027 నాటికి మొదటి శాటిలైట్‌ను పరీక్షించడం,

2030 నాటికి 400-500 ఉపగ్రహాలను మోహరించడం,

2035 నాటికి 1600 ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను పూర్తి చేయడం.

జియో స్పెస్ ఫైబర్ ద్వారా కంపెనీ SES శాటిలైట్ నెట్‌వర్క్‌తో కలిసి సేవలు అందించనుంది. 2023లోనే కంపెనీ శాటిలైట్ ఇంటర్నెట్ డెమోను విజయవంతంగా ప్రదర్శించింది.

స్టార్‌లింక్ పరిస్థితి ఏమిటి?

స్టార్‌లింక్ ఇప్పటికే అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ఈ రంగంలో అనుభవం ఉన్న అతిపెద్ద సంస్థ అదే.

కానీ భారత మార్కెట్ ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నమైనది. ఇక్కడ టెక్నాలజీ పోరాటంతో పాటు ధరలపైనా పోటీ ఉంటుంది.

ధరల విషయంలో జియో అందరికంటే ముందు కనిపిస్తోంది. భారత్‌లో జియో ధరల వ్యూహానికి తిరుగులేదు. జియో ఇంకా శాటిలైట్ ఇంటర్నెట్ ధరలను వెల్లడించలేదు, కానీ ధరల విషయంలో ఎలాన్ మస్క్ కంపెనీకి గట్టి పోటీ ఇవ్వనుంది.

అమెరికాలోని చికాగోలో స్టార్‌లింక్ రెసిడెన్షియల్ సర్వీస్ ప్రారంభ ధర నెలకు 55 అమెరికన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.5,000. ఇదే ధర భారత్‌లో కొనసాగితే సామాన్యులకు భారం కానుంది. అందుకే చౌక ప్లాన్లతో జియో పైచేయి సాధించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏమిటి?

శాటిలైట్ ఇంటర్నెట్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే దీనికి మొబైల్ టవర్, ఫైబర్ కేబుల్ అవసరం లేదు. భూమి దిగువ కక్ష్యలో ఉపగ్రహాల సమూహం ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.

ఆ తర్వాత ఇంటి పైకప్పుపై అమర్చిన టెర్మినల్ ద్వారా ఇంటి లోపలికి ఇంటర్నెట్ చేరుతుంది. ఈ టెర్మినల్ కేబుల్ ద్వారా వైఫై రూటర్‌కు కనెక్ట్ అవుతుంది, ఇది ఇంట్లో అంతటా ఇంటర్నెట్ సిగ్నల్‌ను ప్రసారం చేస్తుంది.

భారత్‌లోని మారుమూల ప్రాంతాలు, సముద్ర సరిహద్దులు, ఫైబర్ కేబుల్ చేరని ప్రాంతాలకు శాటిలైట్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడం సాధ్యమవుతుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.