Jio vs Airtel vs BSNL: 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో బెస్ట్ ఏది?
JioFiber 100 Mbps Plan: 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారా? జియో, ఎయిర్టెల్, BSNLలో ఏది బెస్ట్? అన్లిమిటెడ్ డేటా, OTT ప్రయోజనాలు, ధరల పరంగా ఏ ప్లాన్ ముందుందో తెలుసుకుందాం.
Jio vs Airtel vs BSNL: 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో బెస్ట్ ఏది?
JioFiber 100 Mbps Plan: సరైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఎంచుకోవాలంటే ఈరోజుల్లో చాలా పరిశోధన చేయాల్సి వస్తోంది. కేవలం ఇంటర్నెట్ స్పీడ్ మాత్రమే కాకుండా.. ఉచిత కాల్స్, OTT సబ్స్క్రిప్షన్లు, అదనపు బెనిఫిట్స్ కూడా చూడాలి. మీ ఏరియాలో సర్వీస్ అందుబాటు, మోడెమ్/రూటర్ ఛార్జీలు, కొత్త ఫైబర్ లైన్ ఇన్స్టాలేషన్ ఖర్చు, డేటా లిమిట్ వంటివి కూడా పరిగణించాలి.
ప్రస్తుతం 30 Mbps నుంచే ప్లాన్లు ఉన్నా.. 100 Mbps ప్లాన్ తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. జియోఫైబర్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్రధాన సంస్థలు కాగా.. ప్రభుత్వ రంగ BSNL పరిమిత డేటాతో ప్లాన్లు ఇస్తోంది. వీటి పూర్తి పోలిక చూద్దాం.
JioFiber 100 Mbps ప్లాన్లు..
జియోఫైబర్‌లో రెండు 100 Mbps ప్లాన్లు ఉన్నాయి.
రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ డేటా, ఉచిత వాయిస్ కాల్స్ వస్తాయి. ఇందులో OTT బెనిఫిట్స్ ఏవీ ఉండవు. కేవలం హై-స్పీడ్ ఇంటర్నెట్ కావాలనుకునే వారికి ఇది సరిపోతుంది.
రూ.899 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ + ఉచిత కాల్స్‌తో పాటు ఏకంగా 14 OTT సబ్స్క్రిప్షన్లు వస్తాయి. Amazon Prime Lite, JioHotstar, Sony LIV, Zee5, Sun NXT, Hoichoi, Discovery+, TimesPlay, Tarang Plus, Eros Now, Lionsgate Play, ShemarooMe, ETV Win వంటివి ఇందులో ఉన్నాయి. OTT ప్రియులకు ఇది బెస్ట్ వాల్యూ ప్లాన్.
Airtel Xstream Fiber 100 Mbps ప్లాన్లు..
ఎయిర్టెల్ 100 Mbpsలో రూ.799, రూ.999 ప్లాన్లు అందిస్తోంది. రెండూ ప్రీపెయిడ్/పోస్ట్‌పెయిడ్‌లో తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ డేటా, ఉచిత వాయిస్ కాల్స్ కామన్.
రూ.799 ప్లాన్‌లో 2 OTT బెనిఫిట్స్ వస్తాయి. రూ.999 ప్లాన్‌లో ఏకంగా 8 OTT బెనిఫిట్స్ లభిస్తాయి. Netflix Basic, Google One, JioHotstar Super, Adobe Express Premium, Amazon Prime, Apple TV, Xstream Premium Pack, Zee5 వంటి ప్రీమియం మిక్స్ ఇందులో ఉంది. ధర కొంచెం ఎక్కువైనా OTT కాంబినేషన్ పరంగా జియో కంటే ఆకర్షణీయంగా ఉంది.
BSNL 100 Mbps ప్లాన్..
BSNL Air Fibre Smart OTT ప్లాన్ రూ.699కే 100 Mbps స్పీడ్ ఇస్తోంది. నెలకు 4,000 GB వరకు డేటా వస్తుంది. FUP తర్వాత స్పీడ్ 4 Mbpsకు తగ్గుతుంది. ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. కానీ OTT సబ్స్క్రిప్షన్లు ఏవీ లేవు.
బడ్జెట్లో స్టేబుల్ కనెక్షన్ కావాలనుకునేవారికి, OTT అవసరం లేనివారికి BSNL పర్వాలేదు. కానీ హెవీ స్ట్రీమింగ్ చేసేవారికి అన్లిమిటెడ్ డేటా ఉన్న జియో, ఎయిర్టెల్ మంచివి.
ఏది ఎంచుకోవాలి?
కేవలం ఇంటర్నెట్ కోసం తక్కువ ధరలో కావాలంటే Jio రూ.699 లేదా BSNL రూ.699 చూడవచ్చు. ఎక్కువ OTT కావాలంటే Jio రూ.899లో 14 OTTలు వస్తాయి. Netflix, Apple TV, Prime వంటి ప్రీమియం OTTలు కావాలంటే Airtel రూ.999 బెటర్. ధరకు తగ్గ బెనిఫిట్స్, మీ ఏరియాలో నెట్వర్క్ నాణ్యతను బట్టి నిర్ణయం తీసుకోండి.




