జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూ.399 రీఛార్జ్‌తో ఏకంగా రూ. 40వేల బెనిఫిట్స్..!
Jio Rs 399 Plan: తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే జియో యూజర్ల కోసం రూ.399 రీఛార్జ్ ప్లాన్ ఆసక్తికరంగా మారింది.
జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూ.399 రీఛార్జ్‌తో ఏకంగా రూ. 40వేల బెనిఫిట్స్..!
Jio Rs 399 Plan: రిలయన్స్ జియో (Jio) యూజర్ల అవసరాలకు అనుగుణంగా విభిన్న రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. వీటిలో రూ.399 ప్లాన్ డేటా, కాలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఏఐ సేవలను ఒకే ప్యాక్‌లో అందించే ఆల్‌రౌండర్ ప్లాన్‌గా నిలుస్తోంది.
రోజుకు 2.5GB డేటా
రూ.399 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్యాక్‌తో ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం వ్యాలిడిటీ కాలంలో 70GB డేటా వినియోగించుకోవచ్చు.
దీంతో పాటు దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు అందుతాయి. వీడియోలు చూడటం, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్ వంటి అవసరాలకు ఈ డేటా ఉపయోగపడుతుంది.
అర్హత ఉన్నవారికి అన్ లిమిటెట్ 5జీ
ఈ ప్లాన్‌లో మరో ప్రధాన ఆకర్షణ అపరిమిత 5G డేటా. 5G కవరేజ్ ఉన్న ప్రాంతంలో ఉండి, 5G స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే అర్హత ఉన్న యూజర్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
5G వేగంతో పెద్ద ఫైళ్లను వేగంగా డౌన్‌లోడ్ చేయడం, హై క్వాలిటీ వీడియోలను స్ట్రీమ్ చేయడం వంటి పనులు చేసుకోవచ్చు. అయితే 5G ప్రయోజనం పొందేందుకు జియో నిర్దేశించిన అర్హతలు వర్తిస్తాయి.
ఓటీటీ, స్పోర్ట్స్ కంటెంట్ కూడా
రూ.399 ప్లాన్‌లో డేటాతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జియో టీవీ, జియో గేమ్స్, జియో హాట్ స్టార్ మొబైల్ + హాలీవుడ్ సేవలతో పాటు ఫ్యాన్ కోడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
దీంతో క్రికెట్, ఇతర స్పోర్ట్స్, సినిమాలు, వీడియో కంటెంట్‌ను ఆస్వాదించే వారికి ఈ ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది. జియో హాట్ స్టార్ ప్రయోజనం కోసం రీఛార్జ్ సమయానికి సంబంధించిన నిబంధనలు వర్తించవచ్చు.
గూగుల్ జెమినీ ప్రో, కాన్వా ప్రో కూడా!
ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలుగా గూగుల్ జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను 18 నెలల పాటు అందిస్తున్నట్లు సమాచారం. అలాగే జియో ఏఐ క్లౌడ్ ద్వారా 50GB క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.
మరో ఆకర్షణీయమైన ప్రయోజనం కాన్వా ప్రో. దీని విలువ సుమారు రూ.4,000గా పేర్కొంటున్నారు. సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్, బ్యానర్లు, ప్రెజెంటేషన్లు రూపొందించే వారికి కాన్వా ప్రో ఉపయోగపడుతుంది.
అంటే ఒకే రూ.399 రీఛార్జ్‌తో మొబైల్ డేటా, కాలింగ్, 5G, OTT, స్పోర్ట్స్ కంటెంట్, AI టూల్స్, క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.




