Jio 51 Plan: రూ.51కే అన్‌లిమిటెడ్ 5G.. జియో అదిరిపోయే ఆఫర్.!

Jio 51 Plan: భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కేవలం రూ. 51కే అపరిమిత 5G సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా

G Krishna
Published on: 18 Sept 2026 2:41 PM IST
jio-5g
X

jio-5g

Jio 51 Plan: భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కేవలం రూ. 51కే అపరిమిత 5G సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అత్యంత విస్తృతమైన 5G నెట్‌వర్క్ కవరేజీని కలిగి ఉన్న జియో, వినియోగదారులకు ట్రూ అన్‌లిమిటెడ్ డేటా అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మీరు ప్రస్తుతం వాడుతున్న బేస్ రీఛార్జ్ ప్లాన్‌లో 5G ప్రయోజనాలు లేకపోయినా, MyJio యాప్‌లోని 'ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్' విభాగం ద్వారా కేవలం రూ. 51 రీఛార్జ్‌తో 5G నెట్‌వర్క్‌కు సులభంగా అప్‌గ్రేడ్ అవ్వవచ్చు.

డేటా సదుపాయం , అదనపు 4G ప్రయోజనం

ఈ రూ. 51 అప్‌గ్రేడ్ ప్లాన్‌లో అపరిమిత 5G డేటాతో పాటు అదనంగా 3GB హై-స్పీడ్ 4G డేటాను కూడా జియో కొత్తగా చేర్చింది. గతంలో ఈ ప్లాన్‌లో ఎలాంటి 4G డేటా లభించేది కాదు. 5G నెట్‌వర్క్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ఉన్నప్పుడు లేదా మీ హ్యాండ్‌సెట్ 4G మోడ్‌కి మారినప్పుడు ఈ 3GB డేటా ఎంతో ఉపయోగపడుతుంది.

అర్హత నిబంధనలు, షరతులు

రోజుకు 1.5GB డేటాను అందించే బేస్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు మాత్రమే ఈ అప్‌గ్రేడ్ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే మీ ప్రస్తుత ప్రాథమిక ప్లాన్‌కు కనీసం ఒక నెల వ్యాలిడిటీ మిగిలి ఉండటంతో పాటు మీ వద్ద 5G సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అంతేకాకుండా మీరు జియో 5G నెట్‌వర్క్ కవరేజ్ ఉన్న ప్రాంతంలో నివసిస్తుండటం తప్పనిసరి.

వ్యాలిడిటీ , యాప్ ద్వారా తనిఖీ చేసే విధానం

వ్యాలిడిటీ విషయానికొస్తే, ఈ అప్‌గ్రేడ్ ప్యాక్ గడువు మీ బేస్ ప్లాన్ యాక్టివ్ కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇందులో లభించే అపరిమిత 5G యాక్సెస్ మాత్రం ఒక నెలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ఇందులో లభించిన 3GB 4G డేటాను మాత్రం బేస్ ప్లాన్ ముగిసేవరకు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. మీరు ఉన్న ప్రాంతంలో జియో 5G సేవలు లభిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి MyJio యాప్‌ను సందర్శించి చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ స్మార్ట్‌ఫోన్ జియో ట్రూ 5G స్టాండ్‌అలోన్ ఆర్కిటెక్చర్ (5G SA) నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుందో లేదో కూడా యాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది. బడ్జెట్ ధరలో అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందాలనుకునే 1.5GB/రోజువారి ప్యాక్ వినియోగదారులకు ఈ రూ. 51 ప్లాన్ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.