5000mAh బ్యాటరీ, 13MP కెమెరా.. హెచ్ఎండీ నుంచి అదిరిపోయే ఫోన్.. ధరెంతంటే?

HMD Rise price in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HMD భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ ఫోన్ హెచ్ఎండీ రైజ్‌ను విడుదల చేసింది. రూ.9,999 ధరతో వచ్చిన ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ, 13MP కెమెరా, ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ తో పాటు 22 భారతీయ భాషలకు మద్దతిచ్చే సర్వం ఏఐ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Venkat
Published on: 26 Nov 2026 7:17 PM IST
HMD Rise price in India
X

5000mAh బ్యాటరీ, 13MP కెమెరా.. హెచ్ఎండీ నుంచి అదిరిపోయే ఫోన్.. ధరెంతంటే?

HMD Rise price in India: భారత్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హెచ్ఎండీ కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. హెచ్ఎండీ రైజ్‌ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.10 వేల లోపే నిర్ణయించింది. తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ, AI ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.

హెచ్ఎండీ రైజ్‌ ధర, సేల్ వివరాలు..

హెచ్ఎండీ రైజ్‌ స్మార్ట్‌ఫోన్‌ను 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ చేశారు. దీని Day 1 స్పెషల్ లాంచ్ ధర రూ.9,999గా ప్రకటించారు. ఈ ధరలో అన్ని ఆఫర్లు కలిపి ఉన్నాయని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్ విక్రయాలు డిసెంబర్ 2 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి. ఇండిగో సిల్వర్, మిడ్ నైట్ గోల్డ్, ఎమిరాల్డ్ గోల్డ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులోకి రానుంది.

హెచ్ఎండీ రైజ్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

హెచ్ఎండీ రైజ్‌ లో 6.517 అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. Unisoc 9863A ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 128GB వరకు పెంచుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ పై పనిచేస్తుంది. ఫోన్‌కు రెండేళ్ల పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

22 భారతీయ భాషలకు మద్దతిచ్చే సర్వం ఏఐ..

హెచ్ఎండీ రైజ్‌ లో ప్రత్యేక ఆకర్షణ ఇండస్ బై సర్వం ఏఐ. ఈ AI ఫీచర్ 22 భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. దీంతో వినియోగదారులు తమకు తెలిసిన భారతీయ భాషల్లో AI సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

ఈ AI సర్వర్లు, డేటా భారత్‌లోనే హోస్ట్ అవుతాయని కంపెనీ పేర్కొంది. భారతీయ భాషల్లో AI సేవలను అందించడం ఈ ఫోన్‌లోని ప్రత్యేకతగా చెప్పవచ్చు.

సంచార్ సాథి సపోర్ట్ కూడా..

హెచ్ఎండీ రైజ్‌ లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంచార్ సాథి ప్లాట్‌ఫామ్‌కు ఆప్షనల్ సపోర్ట్ అందించారు. దీని ద్వారా వినియోగదారులు తమ పేరుపై ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు.

అలాగే ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా దాన్ని బ్లాక్ చేయడం, ట్రాక్ చేయడం వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అనుమానాస్పద మోసపూరిత కాల్స్, మెసేజ్‌లపై కూడా ఫిర్యాదు చేయవచ్చు.

13MP కెమెరా, 5000mAh బ్యాటరీ

ఫొటోగ్రఫీ కోసం హెచ్ఎండీ రైజ్‌ లో 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా అందించారు.

ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ కోసం యూఏస్బీ టైప్ సీ పోర్ట్ ఇచ్చారు. బాక్స్‌లోనే ఛార్జర్ కూడా అందిస్తున్నారు. అదనంగా 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా అందించారు.

హెచ్ఎండీ కస్టమర్ సర్వీస్ వివరాలు..

భారత్‌లో HMDకు 275 కేర్ సెంటర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా 18 వేలకుపైగా పిన్‌కోడ్‌ల పరిధిలో పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ అందుబాటులో ఉందని పేర్కొంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.