గూగుల్ కొత్త ఏఐ యాప్.. ఇంటర్నెట్ లేకపోయినా వాడేయోచ్చు.. ఫీచర్లు అదుర్స్ అంతే..!

Google AI Edge Gallery app: సాధారణంగా ఏఐ టూల్స్ అన్నీ క్లౌడ్ సర్వర్ల ద్వారా రన్ అవుతుంటాయి. కానీ ఈ ప్రత్యేకమైన యాప్ మాత్రం మొబైల్ ఆఫ్‌లైన్ మోడ్‌లోనే అద్భుతంగా పనిచేస్తుంది.

Venkat
Published on: 11 Oct 2026 10:00 PM IST
Google AI Edge Gallery app
X

గూగుల్ కొత్త ఏఐ యాప్.. ఇంటర్నెట్ లేకపోయినా వాడేయోచ్చు.. ఫీచర్లు అదుర్స్ అంతే..!

Google AI Edge Gallery app: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో టెక్ దిగ్గజం గూగుల్ మరో విప్లవాత్మక అడుగు వేసింది. ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు సరిగ్గా పనిచేయాలంటే మొబైల్‌లో మొబైల్ డేటా లేదా వైఫై కనెక్షన్ ఉండటం తప్పనిసరి. అయితే ఈ నిబంధనను పూర్తిగా మార్చేస్తూ గూగుల్ సంస్థ 'ఏఐ ఎడ్జ్ గ్యాలరీ' (AI Edge Gallery) పేరుతో ఒక సరికొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను పరిచయం చేసింది. నెట్ లేని సమయాల్లోనూ ఏఐ శక్తిని వినియోగించుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు.

నెట్ లేకున్నా ఏఐ సేవలు..

సాధారణంగా ఏఐ టూల్స్ అన్నీ క్లౌడ్ సర్వర్ల ద్వారా రన్ అవుతుంటాయి. కానీ ఈ ప్రత్యేకమైన యాప్ మాత్రం మొబైల్ ఆఫ్‌లైన్ మోడ్‌లోనే అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్‌తో సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చిత్రాలను రూపొందించుకోవడం, వివిధ కోడింగ్ అంశాలను పరిశీలించడం, ప్రశ్నలకు తక్షణ సమాధానాలు పొందడం వంటి పనులను ఎక్కడైనా చేసుకోవచ్చు.

యూజర్ ప్రైవసీకి పెద్దపీట..

ఈ యాప్ కీ హైలైట్ సేఫ్టీతోపాటు ప్రైవసీ. మనం ఇన్‌పుట్ చేసే డేటా ఏదీ బయటి క్లౌడ్ సర్వర్లకు చేరదు. ఫోన్ లోపలే ఇన్‌బిల్ట్‌గా ఈ ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి డేటా లీకయ్యే రిస్క్ ఉండదు. సర్వర్ రెస్పాన్స్ కోసం ఎదురుచూసే పనిలేకుండా రిజల్ట్స్ క్షణాల వ్యవధిలోనే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

గెమ్మా (Gemma) మోడల్ ప్రత్యేకతలు..

గూగుల్ ప్రవేశపెట్టిన ఈ నూతన యాప్ 'గెమ్మా 31బి' (Gemma 31B) లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా పనిచేస్తుంది. సుమారు 529 ఎంబీ సైజుతో కాంపాక్ట్‌గా లభించే ఈ మోడల్ సెకనుకు ఏకంగా 2,585 టోకెన్లను ప్రాసెస్ చేసే సూపర్ స్పీడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సైజులో చిన్నదిగా ఉన్నప్పటికీ కంటెంట్ సృష్టి, డాక్యుమెంట్ల విశ్లేషణ, స్మార్ట్ ఆన్సరింగ్ వంటి వాటిలో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది.

అపాచీ 2.0 లైసెన్స్‌తో ఓపెన్ సోర్స్‌గా అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ విద్య, వాణిజ్య అవసరాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీని త్వరలోనే ఐఓఎస్ (iOS) ప్లాట్‌ఫారమ్‌కు కూడా విస్తరించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. నెట్‌తో పనిలేకుండా పాకెట్‌లో శక్తివంతమైన ఏఐ టూల్ ఉండాలనుకునే వారికి ఇది నిజంగా ఒక గ్రేట్ ఆప్షన్!

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.