ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Flipkart: బ్లాక్ ఫ్రైడే సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ భారత్‌లో తన బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రారంభించింది.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Flipkart Black Friday: బ్లాక్ ఫ్రైడే సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ భారత్‌లో తన బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రారంభించింది. ఈ షాపింగ్ వేడుకలో భాగంగా వివిధ శ్రేణుల స్మార్ట్ఫోన్లపై కళ్లు చెదిరే తగ్గింపులను అందిస్తోంది. ముఖ్యంగా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లైన శాంసంగ్ గెలాక్సీ ఎస్25, యాపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్ మోడళ్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశంగా నిలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 5జీపై రూ.34 వేల తగ్గింపు
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 5జీ (12జీబీ + 128జీబీ) వేరియంట్ అసలు ధర రూ.1,04,999 కాగా, బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా రూ.70,999 కే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.3,550 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ.46,750 వరకు విలువ పొందే అవకాశం ఉంది.
120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ దీని ప్రత్యేకతలు. వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 10ఎంపీ టెలిఫోటో, 12ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండగా, సెల్ఫీల కోసం 12ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
ఐఫోన్ 17 ధర తగ్గింపు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు
యాపిల్ ఐఫోన్ 17 అసలు ధర రూ.99,900 ఉండగా, ప్రస్తుతం సేల్‌లో రూ.89,100 కే రిటైల్ అవుతోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.53,750 వరకు తగ్గింపు పొందవచ్చు.
120హెర్ట్జ్ ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.3 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఏ19 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో 48ఎంపీ ప్రైమరీ, 48ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌లతో కూడిన 48ఎంపీ డ్యూయల్ ఫ్యూజన్ బ్యాక్ కెమెరా, ముందువైపు 18ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
ఐఫోన్ ఎయిర్‌పై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్
యాపిల్ ఐఫోన్ ఎయిర్ (512జీబీ) మోడల్ రూ.1,21,900 ధరకు అందుబాటులో ఉంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుండగా, పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్పై ఏకంగా రూ.71,650 వరకు విలువ పొందవచ్చు. 6.5 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120హెర్ట్జ్ ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్లో ఉన్నాయి.
ఏ19 ప్రో ప్రాసెసర్‌తో పాటు యాపిల్ ఎన్1 వైర్లెస్ చిప్, సీ1ఎక్స్ మోడెమ్ ఇందులో అమర్చారు. వెనుకవైపు 48ఎంపీ ప్రైమరీ సెన్సార్, సెల్ఫీల కోసం 18ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫ్లాగ్షిప్ ఆకట్టుకుంటోంది.




