రూ.96,290కే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్.. క్రోమా బంపర్ ఆఫర్.!
కొత్త ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న టెక్ ప్రియులకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ క్రోమా (Croma) అదిరిపోయే శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా..
iPhone 17 Pro Max Discount
కొత్త ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న టెక్ ప్రియులకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ క్రోమా (Croma) అదిరిపోయే శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'బ్లాక్ ఫ్రైడే సేల్' (Black Friday Sale) లో భాగంగా లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్' (Apple iPhone 17 Pro Max) పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా 256GB స్టోరేజ్ కలిగిన ఆరెంజ్ కలర్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను అన్ని ఆఫర్లు కలుపుకుని కేవలం రూ. 96,290 ఎఫెక్టివ్ ధరకే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. బ్యాంక్ క్యాష్‌బ్యాక్, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ , అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కలిపి క్రోమా ఈ ఆకర్షణీయమైన డీల్‌ను అందిస్తోంది.
ఆఫర్ వివరాలు ఇలా.. ఈఎంఐ సదుపాయం కూడా
క్రోమా ప్రకటించిన ఈ ఆఫర్ కింద ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (256GB) కొనుగోలు చేసే కస్టమర్లకు గరిష్టంగా రూ. 4,000 వరకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీనికి తోడు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి భారీ ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు మీ పాత ఐఫోన్ 14 (128GB) మోడల్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 24,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువతో పాటు, అదనంగా మరో రూ. 8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఒకేసారి పూర్తి మొత్తం చెల్లించలేని వారి కోసం నెలకు రూ. 11,143 నుంచి ప్రారంభమయ్యే సులభతరమైన ఈఎంఐ (EMI) సదుపాయాన్ని కూడా క్రోమా అందుబాటులో ఉంచింది. అయితే తుది ధర అనేది ఎంచుకునే బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ అర్హత , పాత ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
నవంబర్ 30 వరకు మాత్రమే ఈ సేల్
క్రోమా నిర్వహిస్తున్న ఈ ఐదు రోజుల బ్లాక్ ఫ్రైడే సేల్ నవంబర్ 26న ప్రారంభమై, నవంబర్ 30, 2026 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో కేవలం స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాకుండా ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్లు, గృహోపకరణాలు , పర్సనల్ కేర్ ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. స్టాక్ లభ్యత , నిబంధనలకు లోబడి ఎంపిక చేసిన క్రోమా స్టోర్లలో కస్టమర్లు ఈ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఆఫర్‌ను పొందవచ్చని సంస్థ వెల్లడించింది.




