బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్లు.. రోజుకు రూ.6లోపే.. ఏడాది వ్యాలిడిటీతో అదిరిపోయే బెనిఫిట్స్

BSNL Recharge Plans: ఎక్కువ కాలం సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలని చూసే వారికి బీఎస్ఎన్ఎల్ దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లు ఉపయోగకరంగా మారుతున్నాయి.

Venkat
Published on: 29 Oct 2026 9:23 PM IST
BSNL Recharge Plans
X

బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్లు.. రోజుకు రూ.6లోపే.. ఏడాది వ్యాలిడిటీతో అదిరిపోయే బెనిఫిట్స్

BSNL Recharge Plans: తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి బీఎస్ఎన్ఎల్ (BSNL) లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా రూ.1,499, రూ.1,999 రీఛార్జ్ ప్లాన్లు దాదాపు ఏడాది పాటు సేవలను కొనసాగించేందుకు అవకాశం ఇస్తున్నాయి.

ధరలో రూ.500 తేడా ఉన్నా.. డేటా బెనిఫిట్స్ విషయంలో మాత్రం ఈ రెండు ప్లాన్లు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.

రూ.1,999 ప్లాన్‌లో ఏం వస్తుంది?

రూ.1,999 ప్లాన్‌తో 330 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలంలో అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 100 SMSలు అందుతాయి.

డేటా విషయానికి వస్తే ప్రతిరోజూ 1.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో పాటు మొత్తం వ్యాలిడిటీకి అదనంగా 10GB డేటా కూడా అందుతుంది.

రోజువారీ 1.5GB డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 Kbpsకు తగ్గుతుంది.

ఈ ప్లాన్‌కు రోజుకు సగటున సుమారు రూ.6.05 ఖర్చవుతుంది. ప్రతిరోజూ మొబైల్ డేటా వినియోగించే వారికి ఇది ఉపయోగకరమైన ఎంపిక.

రూ.1,499 ప్లాన్ ప్రత్యేకత ఏంటి?

రూ.1,499 ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులోనూ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.

అయితే డేటా విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రోజువారీ డేటా ఇవ్వకుండా మొత్తం 300 రోజుల కాలానికి కలిపి 32GB డేటా అందిస్తారు.

ఈ 32GBను యూజర్ తన అవసరాన్ని బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. ఒకే రోజులో ఎక్కువ డేటా అవసరమైనా ఉపయోగించుకోవచ్చు. డేటా పూర్తయిన తర్వాత స్పీడ్ 40 Kbpsకు తగ్గుతుంది.

ఈ ప్లాన్‌లో రోజుకు సగటున సుమారు రూ.4.99 మాత్రమే ఖర్చవుతుంది.

ఏ ప్లాన్ బెస్ట్?

మీకు కేవలం కాల్స్, SMSలు, సిమ్ యాక్టివ్‌గా ఉండటం ప్రధాన అవసరం అయితే రూ.1,499 ప్లాన్ చౌకైన ఎంపిక. 300 రోజుల వ్యాలిడిటీతో తక్కువ ఖర్చులో పని పూర్తవుతుంది.

అయితే ప్రతిరోజూ మొబైల్ డేటా అవసరమైతే రూ.1,999 ప్లాన్ మెరుగైన ఎంపిక. ఇందులో రోజుకు 1.5GB డేటాతో పాటు 330 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.

అంటే డేటా తక్కువగా వాడేవారికి రూ.1,499.. రోజువారీ డేటా అవసరమయ్యే వారికి రూ.1,999 ప్లాన్ సరిపోతుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.