BSNL: బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్.. ఇక 380 రోజుల పాటు రీఛార్జ్ టెన్షన్ లేదు
BSNL: బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. ఇప్పుడు ఈ రీఛార్జ్ 380 రోజుల పాటు పనిచేస్తుంది.
BSNL
BSNL: ప్రభుత్వ రంగ టెకామ్ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. తరచూ రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది నుంచి విముక్తి కోరుకునే వారి కోసం కంపెనీ రూ. 2,399 ప్లాన్‌ను అందిస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రత్యేక ఆఫర్ కింద కంపెనీ దీనికి అదనంగా మరో 15 రోజుల వ్యాలిడిటీని ఫ్రీగా ఇస్తోంది. దీనివల్ల ఈ ప్లాన్ మొత్తం 380 రోజుల పాటు పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం సేవలు కోరుకునే వారికి ఇది చక్కటి ఎంపికగా నిలుస్తోంది.
రోజువారీ ఖర్చు కేవలం రూ.6
రూ. 2,399 ధర కలిగిన ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు భారీ ప్రయోజనాలు లభిస్తున్నాయి. లెక్కగట్టి చూస్తే ఈ ప్లాన్‌కు రోజువారీ ఖర్చు కేవలం ఆరు రూపాయల ముప్పై ఒక పైసలు మాత్రమే అవుతుంది. తక్కువ బడ్జెట్లో ఏడాదికి పైగా కాలింగ్ అలాగే ఇంటర్నెట్ సేవలు అందించే ప్లాన్ ఇదే కావడం విశేషం. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ కోరుకునే మొబైల్ యూజర్లకు ఈ రీఛార్జ్ ప్లాన్ ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుంది.
అదనపు డేటా లబ్ది
వ్యాలిడిటీ పెరగడంతో పాటు వినియోగదారులకు లభించే డేటా పరిమాణం కూడా పెరిగింది. ఈ ప్లాన్‌లో రోజువారీ రెండు జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. 380 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తంగా 760 జీబీ డేటా వినియోగదారుల ఖాతాలో జమ అవుతుంది. గతంలో 365 రోజులకే పరిమితమైనప్పుడు 730జీబీ మాత్రమే లభించేది. ఇప్పుడు అదనంగా 30 జీబీ ఎక్స్ట్రా డేటా లభిస్తుండటం విశేషం.
అన్లిమిటెడ్ కాల్స్ అలాగే ఎస్ఎంఎస్ సౌకర్యం
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఎలాంటి పరిమితులు లేకుండా నచ్చినంత సేపు కమ్యూనికేట్ చేయవచ్చు. దీనితో పాటు ప్రతిరోజూ 101 ఎస్ఎంఎస్లను పంపుకునే అవకాశం ఉంది. మొత్తం వ్యాలిడిటీ కాలంలో దాదాపు 38000 ఎస్ఎంఎస్ల ప్రయోజనం కస్టమర్లకు అందుతుంది. డేటా, కాలింగ్ పరంగా ఇది పూర్తి సంతృప్తినిచ్చే ప్లాన్‌గా చెప్పవచ్చు.
ఆఫర్ ముగింపు తేదీ, కొనుగోలు వివరాలు
కంపెనీ ఎక్స్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం ఇది ఒక పరిమిత కాలపు ఆఫర్ మాత్రమే. ఈ ప్రత్యేక అదనపు వ్యాలిడిటీ ఆఫర్ అక్టోబర్ 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారులు ఆ తేదీలోపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్ సాధారణ వ్యాలిడిటీ అయిన 368 రోజులకు మారుతుంది. యూజర్లు తమ సమీపంలోని కార్యాలయాల ద్వారా లేదా సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.




