Apple: యాపిల్ నుంచి సరికొత్త ఐప్యాడ్ మినీ లాంచ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంకే

Apple: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ మరోసారి తన సరికొత్త డివైజ్‌తో మార్కెట్‌లో సంచలనం సృష్టించింది.

CR Reddy
Published on: 27 Oct 2026 8:25 AM IST
Apple iPad mini
X

Apple iPad mini

Apple: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ మరోసారి తన సరికొత్త డివైజ్‌తో మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నూతన హంగులతో రూపొందించిన ఐప్యాడ్ మినీ (2026) మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈసారి ట్యాబ్ డిజైన్ నుంచి ఇంటర్నల్ హార్డ్‌వేర్ వరకు అనేక సంచనాత్మక మార్పులను తీసుకువచ్చారు. ముఖ్యంగా ఇందులో మొదటిసారిగా 8.5 అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అమర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్, పవర్ఫుల్ కొత్త ప్రాసెసర్ అలాగే వాటర్ రెసిస్టెంట్స్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈ ట్యాబ్ టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ధరలు అలాగే ప్రీ-బుకింగ్ వివరాలు

భారత మార్కెట్‌లో కొత్త ఐప్యాడ్ మినీ వై-ఫై మోడల్ ప్రారంభ ధర రూ.82,900గా నిర్ణయించారు. ఇందులో 128GB స్టోరేజ్ లభిస్తుంది. ఇక వై-ఫై + సెల్యులర్ మోడల్ ధర రూ.1,00,900 నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ వర్తించనుండగా, దీనిని రూ.76,900 కే కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ ట్యాబ్ 128GB, 256GB అలాగే 512GB వేరియంట్లలో మిడ్‌నైట్, స్టార్‌లైట్ రంగులలో లభిస్తుంది. అక్టోబర్ 28 నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కానుండగా, నవంబర్ 6 నుంచి అధికారిక స్టోర్లలో విక్రయాలు మొదలవుతాయి.

పవర్ఫుల్ A20 ప్రో చిప్, డిస్‌ప్లే ప్రత్యేకతలు

ఈ ట్యాబ్‌లో అత్యాధునిక 2nm టెక్నాలజీతో రూపొందించిన యాపిల్ A20 ప్రో చిప్‌సెట్‌ను జోడించారు. దీనివల్ల మునుపటి మోడల్‌తో పోలిస్తే ఏఐ పనితీరు 4.5 రెట్లు, గ్రాఫిక్స్ 2.7 రెట్లు వేగంగా పనిచేస్తాయి. ఇందులో 8.5 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ ఓఎల్‌ఈడీ స్క్రీన్ ఇచ్చారు. ప్రకాశవంతమైన ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా నానో-టెక్చర్ డిస్‌ప్లే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే యాపిల్ పెన్సిల్ ప్రో సపోర్ట్ దీనికి మరింత బలాన్ని ఇస్తుంది.

వాటర్ రెసిస్టెంట్స్, అత్యాధునిక సౌండ్ సిస్టమ్

ఐప్యాడ్ సిరీస్‌లో తొలిసారిగా ఐపీ67 రేటింగ్ తో కూడిన వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఈ ట్యాబ్‌లో అందించడం విశేషం. దీనికి తోడు స్క్రీన్ ద్వారా నేరుగా శబ్దం వచ్చేలా అకాస్టిక్ డిస్ప్లే సిస్టమ్‌ను అమర్చారు. ఫొటోగ్రాఫీల కోసం 12 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ అలాగే రియర్ కెమెరాలను పొందుపరిచారు. వై-ఫై 7, బ్లూటూత్ 6.0 కనెక్టివిటీతో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్, సిరి ఏఐ సపోర్ట్ లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 10 గంటల పాటు నిరంతరం వీడియోలు వీక్షించే బ్యాటరీ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.