ఎయిర్‌టెల్ బంపరాఫర్.. ఆ రీఛార్జ్‌తో 4 ఓటీటీలు ఉచితం..!
Airtel Rs 598 plan: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ఓ అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఎయిర్‌టెల్ బంపరాఫర్.. ఆ రీఛార్జ్‌తో 4 ఓటీటీలు ఉచితం..!
Airtel Rs 598 plan: ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన రూ.598 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రస్తుతం టెక్ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. దీని చెల్లుబాటు కాలం 28 రోజులుగా ఉంది. ఈ కాలపరిమితిలో యూజర్లకు ప్రతిరోజూ 2 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. మొత్తం మీద ఈ ప్లాన్ ద్వారా 56 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా అర్హత కలిగిన వినియోగదారులకు ఎయిర్‌టెల్ ద్వారా 5జీ డేటాను కూడా ఉచితంగా అందిస్తున్నారు.
ఈ ప్లాన్‌లో అతిపెద్ద ఆకర్షణగా నిలిచింది ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు. కేవలం ఒక్క రీఛార్జ్‌తో జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5 ప్రీమియంతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్ కూడా 28 రోజుల పాటు లభిస్తాయి. సాధారణంగా ఈ విభిన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కోసం విడివిడిగా డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి అదనపు రుసుము లేకుండా వీటన్నింటిని ఎంజాయ్ చేసే అవకాశం కలుగుతుంది.
అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసిన వెంటనే ఓటీటీ సర్వీసులు నేరుగా యాక్టివేట్ కావు. వీటిని పొందేందుకు వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ మొబైల్స్‌లో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ యాప్‌లోని బెనిఫిట్స్ సెక్షన్‌కు వెళ్లి అక్కడ సూచించిన విధంగా ఒక్కో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను విడిగా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.




