Amadalavalasa: స్థానిక పోరులో వైసీపీదే విజయం: చింతాడ రవికుమార్

Amadalavalasa: గాంధీజీ కలలుగన్న స్థానిక స్వపరిపాలనకు వైఎస్ జగన్ ప్రాధాన్యం ఇచ్చారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని చింతాడ రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు.

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 20 Oct 2026 8:52 PM IST
Amadalavalasa
X

Amadalavalasa: స్థానిక పోరులో వైసీపీదే విజయం: చింతాడ రవికుమార్

Amadalavalasa: గాంధీజీ కలలుగన్న స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యం ఇచ్చిన నేతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిలిచారని ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆమదాలవలసలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చింతాడ రవికుమార్ విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అరాచక శక్తులను ఉపయోగిస్తోందని, ప్రజాస్వామ్య విలువలకు ఏ విధంగా విఘాతం కలుగుతోందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన ఆరోపించారు. కూటమి నాయకులు మూడు కండువాలు వేసుకుని ప్రతి కార్యకర్తను అగౌరవపరిచే విధంగా వ్యవహరించారని విమర్శించారు.

ఎటువంటి అరాచకాలకు తావులేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైసీపీ నూరు శాతం విజయం సాధిస్తుందని చింతాడ రవికుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA