Palakonda: పాలకొండ నగర పంచాయతీని కైవసం చేసుకుంటాం!

Palakonda: పాలకొండ నగర పంచాయతీని కైవసం చేసుకుని అన్ని వార్డులలో విజయం సాధిస్తామని స్పష్టం చేసిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మరియు మాజీ ఎమ్మెల్యే కళావతి.

KAILASH SAHU, PALAKONDA
Published on: 3 Oct 2026 7:52 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండ నగర పంచాయతీని కైవసం చేసుకుంటాం!

Palakonda: పాలకొండ నగర పంచాయతీ నీ రానున్న మున్సిపల్ ఎన్నికలలో కైవసం చేసుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని అలాగే 28 వార్డులలో కౌన్సిలర్సనుపోటీకి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పేర్కొన్నారు గురువారం స్థానిక ఎమ్మెల్సీ ఇంటి వద్ద పాలకొండ పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికలలో 28 వార్డులలో దీటైన అభ్యర్థులను ఎంపిక చేసి గెలుపు దిశగా అడుగులు వేయాలని ఆశవాహూ లను పిలుపునిచ్చారు చైర్మన్ అభ్యర్థి ఎవరైనా అధిష్టాన వర్గం నిర్ణయించిన వారికి కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని అందుకు సన్నద్ధంగా క్యాడర్ అంతా అలాగే కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పట్టణానికి సంబంధించి పట్టణ అధ్యక్షుడు వెలమల మన్మధరావు కోరాడ సూర్యనారాయణ బాబు పూర్వపు కమిషనర్ ఎద్దు లిల్లీ పుష్పనాదం ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఉంటుందని ఈ కమిటీ ఆధ్వర్యంలో రానున్న మున్సిపల్ ఎన్నికలలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు అందుకు అనుకూలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ శ్రేణులు కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్స్ కడగల వెంకటరమణ నీలాపు శ్రీనివాసరావు దుప్పాడ పాపినాయుడు కొడెం విజయకుమార్ కిల్లారి మోహన్ రావు భానుబాబు తూముల లక్ష్మణరావు కోరాడ రవి దాశరెడ్డి మధు పల్లి లక్ష్మనాయుడు రెడ్డి కేశవరావు పాలవలస రమేష్ కుమార్ తుంబలి వాసుదేవరావు గెద్ద చిన్ననాయుడు తుమ్మగుంట జగదీష్ ముదిలి గోవిందా,దుంపల రమేష్ బాబు టేకి రామకృష్ణ సుంకరి ధర్మ భాసూరు కాంతారావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA