Srikakulam: నరసన్నపేట ఆసుపత్రిలో ప్రసవానంతరం బాలింత మృతి.. ఆందోళన!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానంతరం వివాహిత దివ్య మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆందోళన.
Srikakulam: నరసన్నపేట ఆసుపత్రిలో ప్రసవానంతరం బాలింత మృతి.. ఆందోళన!
Srikakulam: తండాసి కిరణ్. సెంటర్ :నరసన్నపేట. శ్రీకాకుళం జిల్లా. ప్రసవానంతరం మహిళ మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆందోళన
నరసన్నపేట పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరిరాని బాలకృష్ణ భార్య *బుద్దాల దివ్య (24)*ను ఈ నెల 1వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. అయితే రాత్రి సుమారు 10 గంటల సమయంలో దివ్య పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించాలని ఆసుపత్రి సిబ్బంది సూచించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
అయితే అప్పటివరకు దివ్య పరిస్థితి గురించి తమకు స్పష్టంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రి రిమ్స్ కి తరలించిన అనంతరం వైద్యులు చికిత్స నిర్వహించి కడుపులో రక్తస్రావం ఉన్నట్లు చెప్పారని, పరిస్థితి విషమించడంతో 3వ తేదీన దివ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యం నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని, దివ్య మృతికి అసలు కారణం ఏమిటో విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ దివ్య తల్లిదండ్రులు, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యరాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ క్లినిక్ వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారు ఈ వైద్యురాలే తమ బిడ్డ మృతికి కారణమని గతంలో 9 నెలలు ఈమె వద్దే చికిత్స చేయిస్తున్నట్టుఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణలపై సంబంధిత వైద్యాధికారులు స్పందించి, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.




