Srikakulam: ఎన్‌టీఆర్ స్కూల్ గ్రౌండ్‌ను గ్రీన్‌జోన్‌గా మారుస్తాం: దానేటి శ్రీధర్!
Srikakulam: శ్రీకాకుళం ఎన్‌టీఆర్ స్కూల్ గ్రౌండ్‌ను గ్రీన్‌జోన్‌గా మారుస్తామని, రాధారాణి మేయర్ అయిన 100 రోజుల్లోనే వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని దానేటి శ్రీధర్ తెలిపారు.
Srikakulam: ఎన్‌టీఆర్ స్కూల్ గ్రౌండ్‌ను గ్రీన్‌జోన్‌గా మారుస్తాం: దానేటి శ్రీధర్!
శ్రీకాకుళం: శ్రీకాకులం నడిబొడ్డున ఉన్న ఎన్‌టీఆర్ ఎంహెచ్ స్కూల్ గ్రౌండ్‌ను గ్రీన్‌జోన్‌గా మార్పు చేయాలన్న ఆలోచన తనకు ఎప్పటి నుంచో ఉందని జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. గుడ్ మార్నింగ్ దానేటి పేరిట ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని ఎన్ టీఆర్ మున్సిపల్ మైదానంలో క్రీడాకారులను, వాకర్స్‌ను డాక్టర్ శ్రీధర్ కలుసుకొని మేయర్ అభ్యర్థినిగా దానేటి రాధారాణికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా వాకర్స్‌తో పాటు ఎన్‌టీఆర్ మున్సిపల్ మైదానంలో ఉన్న ఎర్రంనాయుడు కళాప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది గొప్ప వేదిక మార్పు చేస్తానని హామీనిచ్చారు. మైదానంలో అన్ని హంగులతో కూడిన వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపడతానని చెప్పారు. రాధారాణి మేయర్‌గా గెలిచిన 100 రోజుల్లోనే ఈ హామీని నెరవేరుస్తానని తెలిపారు.
అనంతరం బాక్సింగ్ క్రీడాకారులతో పాటు జిల్లాలో ఎంతో గొప్ప క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్లే వారు ఉన్నతంగా రాణించలేక పోతున్నారని తెలిపారు. జిల్లా క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో చూడాలన్నదే తన అభిమతం, ఆకాంక్ష అని పేర్కొన్నారు. క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని క్రీడాకారులను ప్రోత్సహించారు.
అనంతరం తోటవీధిలో ప్రమాదంలో గాయపడిన న్యాయవాది నాదెళ్ల భాస్కర్‌ను పరామర్శించారు. అనంతరం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆదిత్యుని వాహనమైన ఏడు అశ్వాల స్ఫూర్తితో శ్రీకాకుళం నగరాన్ని ఏడు రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో శ్రీ-7 పేరిట ఓ ప్రణాళిక సిద్ధం చేశామని డాక్టర్ దానేటి శ్రీధర్ వివరించారు. రానున్న భవిష్యత్ తరాల కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు.




