Ichchapuram: ఇచ్ఛాపురం విజేతలకు విప్ బెందాళం అశోక్ అభినందనలు

Ichchapuram: ఇచ్ఛాపురం మున్సిపల్ ఎన్నికల్లో 5,834 ఓట్ల మెజార్టీతో గెలిచిన చైర్‌పర్సన్ ఆశి లీలారాణి, కౌన్సిలర్లను ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ఘనంగా సత్కరించారు.

G.RAMBABU, SOMPET
Published on: 3 Nov 2026 7:58 PM IST
Ichchapuram
X

Ichchapuram: ఇచ్ఛాపురం విజేతలకు విప్ బెందాళం అశోక్ అభినందనలు

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం విజేతలు ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిశారు. ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్ పర్సన్ గా గెలుపొందిన ఆశి లీలారాణి, గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులు అశోక్ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా బెందాళం అశోక్ మాట్లాడుతూ... "ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారు. చైర్ పర్సన్ గా లీలారాణి గారు 5834 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం చాలా సంతోషం. ప్రతి కౌన్సిలర్ కష్టపడి పని చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. ఇచ్ఛాపురం పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలి.

చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆశయాలకు అనుగుణంగా పని చేయండి. మీకు ఎల్లప్పుడూ నేను అండగా ఉంటాను" అని అభినందనలు తెలిపారు. అనంతరం విజేతలకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET