Polaki: ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు ఆగవు: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

Polaki: ఎన్ని ఇబ్బందులున్నా పేదల సంక్షేమం ఆగదు పోలాకి మండలం కుసుమపోలవలస ‘పేదల సేవలో 2.0’ సభలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.. రాజముద్ర పాసుపుస్తకాల పంపిణీ.

TANDASI KIRAN, NARASANNAPETA
Published on: 1 Oct 2026 10:33 PM IST
Polaki
X

Polaki: ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు ఆగవు: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

పోలాకి: రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, పేదలు మరియు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారు స్పష్టం చేశారు. పోలాకి మండలం పరిధిలోని కుసుమపోలవలస గ్రామంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పేదల సేవలో 2.0' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి కోతలు ఉండవని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ ఫలాలు నేరుగా అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఆయన పునరుద్ఘాటించారు. అర్హులందరికీ నిరంతరాయంగా పథకాల అమలు ప్రజల అవసరాలను గుర్తించి, వాటికి తగినట్లుగా సంక్షేమ పథకాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించడమే ప్రభుత్వ ప్రాథమిక విధి అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు పేర్కొన్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న ప్రధాన పథకాలైన 'తల్లికి వందనం', ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, భద్రతా పెన్షన్లు వంటి వాటిని మరింత సమర్థవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధానాంశమని వివరించారు. కేవలం ప్రస్తుత పథకాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులోనూ మరిన్ని నూతన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజల జీవనశైలిని మెరుగుపరచడానికి కృషి చేస్తామని హామీనిచ్చారు.

గ్రామసభల ద్వారానే సమస్యల పరిష్కారం

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గ్రామసభలు వేదికవుతున్నాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను పరిశీలించి, వాటి తక్షణ పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.అనంతరం రాజముద్ర తో కూడిన పట్టాదారు పాసుపుస్తలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అధికారులు, ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TANDASI KIRAN, NARASANNAPETA

TANDASI KIRAN, NARASANNAPETA